Sukumar : ఆర్య సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్… ఆ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధిస్తూ రావడమే కాకుండా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రీసెంట్ గా ‘పుష్ప 2’ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఆయన తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన గత కొన్ని సినిమాల నుంచి ఎక్కువగా 80స్ , 90స్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు, మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ప్రేక్షకుల్లో మంచి అటెన్షన్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇక ఈ రోజుల్లో ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి ప్రేక్షకులను మెప్పించబోతున్నాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటివరకు రామ్ చరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో రంగస్థలం ఒకటి… అలాంటి సూపర్ సక్సెస్ ని అందించిన సుకుమార్ మరోసారి రామ్ చరణ్ తో జత కట్టడం అనేది అందరికి సంతోషాన్ని ఇచ్చే విషయమనే చెప్పాలి.
నిజానికి మెగా అభిమానులు సైతం ఈ విషయంలో చాలావరకు సంబరాలు చేసుకుంటున్నారు. కానీ సుకుమార్ మరోసారి 80స్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడప్పుడే సుకుమార్ 80స్ బ్యాక్ డ్రాప్ ని వదిలే ప్రసక్తి లేనట్టుగా తెలుస్తోంది. ఇక కాంటెంపరరీ ఇష్యూస్ మీద ఆయన సినిమాలను చేయడం లేదు.
కారణం ఏదైనా కూడా సుకుమార్ కి ఒక మార్క్ అనేది ఉంది. కానీ గత కొన్ని సినిమాల నుంచి ఆయన మార్క్ అయితే కనిపించడం లేదు. మరి మరోసారి రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాతో తన మార్కు మొత్తాన్ని చూపించే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ఇప్పటివరకు సుకుమార్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు ఉండరనేది వాస్తవం… అలాంటి సినిమాలతో డీటెయిల్ సీన్స్ ని రాసుకోవడంలో ఆయనను మించిన దర్శకుడు మరొకరు ఉండరు…