Shankar : శంకర్ అనే పేరు ఒకప్పుడు బ్రాండ్. ఈయన ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంటే ఆడియన్స్ అంతా ఆసక్తిగా వేచి చూసేవాళ్లు. కానీ ఏమైందో ఏమో గానీ కొన్ని సంవత్సరాల నుంచి ఈయన నుంచి ఊహించిన రేంజ్ లో సినిమాలు రావడం లేదు. ఇక రోబో తర్వాత శంకర్ నమ్బన్ రీమేక్ చేశారు. ఇందులో విక్రమ్ హీరోగా ప్రధాన పాత్ర పోషించారు. అదేనండి ఐ సినిమా. ఇది తెలుగులో ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. తమిళంలో మాత్రం కమర్షియల్‌గా సేఫ్ అయిందనే చెప్పాలి. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన 2.0 కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
గతేడాది విడుదలైన ఇండియన్ 2 గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే కదా. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాతో మరో సారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ దర్శకుడు. ఈ సినిమా ఫలితంపైనే శంకర్ కెరీర్ ఆధారపడి ఉంది అంటున్నారు విశ్లేషకులు. అయితే ఈ మధ్య ఎక్కువగా విఎఫ్ఎక్స్ సినిమాలు చేశారు శంకర్. అంటే చాలా సంవత్సరాల తర్వాత పొలిటికల్ సినిమా చేసారు ఈ దర్శకుడు.
గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత ఇండియన్ 3 కూడా లైన్‌లోనే ఉందట. గేమ్ ఛేంజర్ హిట్టైతే ఇండియన్ 3కి మళ్లీ ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ఇక మొదటి రోజు మంచి కలెక్షన్లే వచ్చినా ఇంకా కొన్ని రోజులు పోతే సినిమా పరిస్థితి అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ తో సాగడం లేదు. కొందరు ఆవరేజ్ అంటే మరికొందరు హిట్ అంటున్నారు. ఇంకొందరు పర్వాలేదు అంటున్నారు. మరి ఈ మిశ్రమ పలితాల మధ్య సినిమా కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో సంక్రాంతి వరకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో.. పార్ట్ 3పై ఎవరికీ పెద్దగా ఆసక్తి కూడా లేదు. దీని తర్వాత ప్రాజెక్ట్‌కు ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట ఈ డైరెక్టర్. అయితే వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం.
వీరయుగ నాయగన్ వేల్పరి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని టాక్. ఈ సినిమాను శంకర్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్‌లో సాయం చేశారు మధురై ఎంపి వెంకటేశన్. అయిత ఈయన రాసిన నవలలో వేల్పరి నేపథ్యం ఉంటుంది. దీన్ని కూడా తన సినిమా కోసం ఉపయోగించబోతున్నారు డైరెక్టర్ శంకర్. గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఆడితే.. శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ సినిమా పై అంచనాలు పెరగవచ్చు. ఇక వేల్పరి ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాలో ఉన్న సూపర్ స్టార్స్‌తో ప్లాన్ చేయబోతున్నారట శంకర్. మరి ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే చెప్పాల్సిందే.