https://oktelugu.com/

Game changer : శంకర్ గేమ్ చెంజర్ సినిమా వల్ల ఆ మూవీని వదులుకున్న రామ్ చరణ్… ఇంతకీ ఏంటా మూవీ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 11, 2025 / 02:33 PM IST

    Game changer

    Follow us on

    Game changer : ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ మంచి సినిమాలను. హేస్తు ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ ని సాధిస్తాడు అంటూ చాలామంది సినిమా అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఎట్టకేలకు ఈ సినిమా అంతటి మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేకపోతుందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి రామ్ చరణ్ కి మంచి క్రేజ్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. దానివల్లే గేమ్ చేంజర్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాని ఆయన రిజెక్ట్ చేశాడు. దాంతో ఆ కథని ఆయన విజయ్ దేవరకొండ తో తెరకెక్కిస్తున్నారు. ఇక మొత్తానికైతే గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా చేసి ఉంటే బాగుండేదని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ లాంటి నాసిరకం కథల కంటే కూడా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో గౌతమ్ తిన్ననూరి రాసుకున్న కథ చాలా బాగుండబోతుందని విజయ్ దేవరకొండ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. దానివల్లనే రామ్ చరణ్ ఆ సినిమా చేసుంటే బాగుండేది అంటూ మరికొంతమంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక శంకర్ గేమ్ చేంజర్ సినిమాకి డేట్స్ ఇవ్వడం వల్లే గౌతమ్ సినిమాను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది…

    మరి ఏది ఏమైనా కూడా అభిమానులు రామ్ చరణ్ ని ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో అలాంటి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికి రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడంలో మాత్రం కొంతవరకు వెనకబడిపోతున్నాడనే చెప్పాలి.

    ఇక రీసెంట్ గా ‘పుష్ప 2 ‘ సినిమాతో అల్లు అర్జున్ పెను ప్రభంజనాన్ని సృష్టించిన విషయం మనకు తెలిసిందే. మరి అలాంటి అల్లు అర్జున్ ను ఢీ కొట్టాలంటే రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్లను సాధించే సినిమాలను చేస్తే తప్ప మరోసారి పాన్ ఇండియాలో స్టార్ హీరోగా తన ఇమేజ్ ను పెంచుకునే అవకాశం అయితే ఉండదు.

    మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…అయినప్పటికి ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించిన కూడా ఆయన కంటూ ఒక మేనియాని సృష్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడనుంది. లేకపోతే యావత్ ఇండియన్ సినిమా హీరోలందరూ అతన్ని డామినేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…