Naga Chaitanya- Balakrishna: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరికి ఎవరో ముందే రాసిపెట్టి ఉంటుందని, దాని అర్థం. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలకృష్ణకు నాగ చైతన్య అల్లుడు అయ్యేవాడట. తెలుగు సినిమాకు రెండు కళ్ళుగా చెప్పుకునే ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. అలాగే ఆ రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరిగేవి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు అందరూ అంటుంటారు. తర్వాత అవి మెల్లగా వీగిపోయాయి. ఎన్టీఆర్- ఏఎన్నార్ మాదిరి, బాలయ్య- నాగార్జున కూడా సన్నిహితంగా ఉండేవారు.

పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులుగా వాళ్ళ మధ్య ఎప్పటి నుండో పరిచయం ఉంది. ఈ క్రమంలో నాగ చైతన్యకు బాలయ్య చిన్న కూతురినిచ్చి వివాహం చేయాలనే ఆలోచన జరిగిందట. ఈ విషయమై బాలయ్య, నాగార్జున మధ్య సంప్రదింపులు జరిగాయట. ఇరు కుటుంబాల పెద్దలు ఓకే అనుకున్నారట. అయితే నాగ చైతన్య అప్పుడే బాంబు పేల్చాడట. తాను హీరోయిన్ సమంతను ప్రేమిస్తున్నట్లు, ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడట. నాగ చైతన్యకు నాగార్జున చాలా నచ్చజెప్పి చూశారట.
సమంతతో పీకల్లోతు ప్రేమలో ఉన్న నాగ చైతన్య ససేమిరా అనడంతో, చేసేది లేక నాగార్జున వెనక్కి తగ్గారట. అనంతరం బాలయ్య చిన్న కూతురు తేజస్విని వైజాగ్ కి చెందిన శ్రీభరత్ ని వివాహం చేసుకున్నారు. ఒకవేళ సమంత ప్రేమలో చైతూ పడకుంటే తేజస్విని భర్త అయ్యేవాడు. ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రి అయ్యేవాడు. తేజస్వినికి 2013లో వివాహం జరగ్గా అప్పటికే సమంత, చైతూ ప్రేమించుకుంటున్నారు. మొదటి చిత్రం ఏమాయ చేశావే నుండే వాళ్ళ మధ్య ఎఫైర్ ఉంది.

ఏడేళ్లకు పైగా ప్రేమించుకున్న ఈ జంట నాలుగేళ్ళ దాంపత్యం తర్వాత విడిపోయారు. 2021 అక్టోబర్ నెలలో సమంత, నాగ చైతన్య అధికారికంగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రకటనకు కొన్ని నెలల ముందు నుంచే వేరుగా ఉన్నారు. విడాకులకు కారణం ఏదైనా కానీ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికి కూడా సమంత నాగ చైతన్య అంటే మండిపడుతున్నారు. ఇద్దరికీ కోల్డ్ వార్ నడుస్తుంది. మరోవైపు తమ తమ ప్రొఫెషన్స్ లో బిజీగా ఉన్నారు. సినిమాలు, సిరీస్లకు సైన్ చేస్తూ దూసుకెళుతున్నారు.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ