Emirates Airline Air Hostess: మనం పనిచేసే చోటకు ఎవ్వరూ ఊహించని వ్యక్తి వస్తే ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. అయితే మన కడుపున పుట్టిన చిన్న పిల్లాడే వస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు.. నిండా ఏడాది దాటిన చిన్న కుర్రాడు విమానంలో బోర్డింగ్ పాస్ పట్టుకొని ఫ్లైట్ ఎక్కాడు. చెక్ చేస్తున్న ఎయిర్ హోస్టెస్ వద్దకు చేరుకొని చూపించాడు. అంతే ఆమె తన డ్యూటీ వదిలేసి ఆ బుడ్డోడిని గట్టిగా హత్తుకుంది. ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదంతా ఎమరేట్స్ విమానంలో చోటుచేసుకుంది.

ఎమిరేట్స్ విమానంలో ఒక అందమైన చిన్న పిల్లవాడు తన చేతిలో బోర్డింగ్ పాస్ పట్టుకొని విమానంలోకి ఎక్కాడు. విమానంలోకి వస్తున్న ఈ చిన్న కుర్రాడు ఎయిర్ హోస్టెస్ కు బోర్డింగ్ పాస్ చూపించాడు. అది చూసి ఆమె షాక్ అయ్యి గట్టిగా హత్తుకుంది. ఎందుకంటే ఆ బోర్డింగ్ పాస్ అందించింది తన కడుపున పుట్టిన కొడుకే. తన కుమారుడిని చూసి ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కౌగిలించుకొని తన భర్తతో పాటే సెల్ఫీలు దిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆగస్టు 24న షేర్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. 15వేల మంది లైక్ చేయగా.. వేల షేర్లు వచ్చాయి. తల్లికొడుకుల క్యూట్ వీడియోను చూసి నెటిజన్లు తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మరిచిపోలేనిది అంటున్నారు.

ఎమిరేట్స్ విమానంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న ఒక మహిళ.. అదే విమానంలో తన భర్త, కుమారుడు వస్తుంటే చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది. ఈ మనోహరమైన వీడియో ఎంతో మంది నెటిజన్ల హృదయాలను తాకింది. తల్లి ఉద్యోగ బాధ్యతల్లో ఉండడంతో కొడుకును చూసుకోవడం లేదు. సడెన్ గా కుమారుడు ప్రత్యక్షమయ్యేవరకూ ఇలా ఆనందంతో కన్నీళ్లు కార్చింది.
View this post on Instagram