Chhattisgarh Village: సామాజిక మాధ్యమాలు వచ్చాక మన జీవన గమనం మారిపోయింది. ఇటీవల కాలంలో అదే బతుకు దెరువుగా మారుతోంది. నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు మార్గం చూపుతోంది. మనసుంటే మార్గం ఉంటుందని చెప్పినట్లు ఆ ఊళ్లో సోషల్ మీడియానే ఉపాధి చూపిస్తోంది. నెలకు రూ. 30 వేల వరకు సంపాదిస్తూ తమకు సాటి లేదని నిరూపిస్తున్నారు. ఏకంగా ఆ ఊళ్లో 30 శాతం మంది ఇదే రంగంలో రాణించడం గమనార్హం. అందరు యూ ట్యూబ్ చానళ్లు ప్రారంభించి ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు.

ఊరందరిది ఓ దారి అయితే ఉల్లిపాయది మరోదారి అన్నట్లు అక్కడ అందరిది ఒకే రూటు కావడం ఇక్కడ ప్రస్థావనార్హం. అందరు ఎవరికి తోచిన విధంగా వారు యూ ట్యూబర్లుగా మారిపోయారు. ఊళ్లో దాదాపు వెయ్యి మంది ఇదే రంగంలో తమ తెలివితేటల్ని పరీక్షించుకుంటున్నారు. యూ ట్యూబ్ ద్వారా ఉపాధి పొందుతూ బతుకు బాటను కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలంలో యూ ట్యూబ్ కూడా మనుషులకు డబ్బులు సమకూర్చే విధంగా మారడం నిజంగా ఆహ్వానించదగినదే.
పని చేసి పదిమందిని సాకితే ఉపాయం కొద్ది వెయ్యి మందిని సాకినట్లు గ్రామంలోని ముప్పై శాతం మంది ఇదే రంగాన్ని ఎంచుకోవడం తెలుస్తోంది. మారుతున్న కాలానుగుణంగా బతుకుల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు రోజంతా కష్టపడితే గానీ డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు మెదడుతో ఆలోచించి చేస్తే ప్రతి పని కూడా మనకు ఆదాయం సమకూర్చేదిగా ఉంటోంది. దీంతోనే చత్తీస్ గడ్ రాష్ట్రంలోని తులసి అనే ఊరిలో అందరు యూ ట్యూబ్ నే నమ్ముకున్నారు. తమ ఆలోచనలకు కార్యరూపం కలిగించే విధంగా రూపుదిద్దుకుని పలు విషయాలు చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.

కొత్తదనం చూపించే విధంగా వీడియోలు పోస్టు చేస్తూ లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటున్నారు. ఫలితంగా వారి సంపాదన రెట్టింపు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యూ ట్యూబ్ ద్వారా ఆ ఊరే సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. వినోదాన్ని అందిస్తూ కూడా వారి జీవనోపాధిని పొందుతున్నారు. యూ ట్యూబ్ ల ద్వారా ఎన్నో విషయాలు చెబుతూ ప్రజల్లో ఆసక్తిని పెంచుతూ వారి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. గ్రామంలో యూ ట్యూబర్లు వినోదం కోసమే తాపత్రయపడుతున్నారు. దీంతో వారి ఆశలకు అనుగుణంగా తమ శక్తియుక్తులు ప్రదర్శిస్తూ ముందుకు పోవడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ