Homeఎంటర్టైన్మెంట్Tamanna Bhatia: స్టార్స్ వెంటపడుతుంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తమన్నా ఎందుకు ప్రేమించింది? సమాధానం...

Tamanna Bhatia: స్టార్స్ వెంటపడుతుంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తమన్నా ఎందుకు ప్రేమించింది? సమాధానం ఇదే!

Tamanna Bhatia: తమన్నా సుదీర్ఘ కెరీర్ కలిగి ఉంది. ఆమెపై ఎఫైర్ రూమర్స్ వచ్చింది తక్కువే. టాలీవుడ్ లో తమన్నా తిరుగులేని స్టార్డం అనుభవించారు. సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా అందరితో జతకట్టింది. తమన్నాకు కోట్ల సంపాదన ఉంది. కోరుకుంటే స్టార్స్, బిజినెస్ టైకూన్స్, పొలిటీషియన్స్ క్యూ కడతారు. పోయి పోయి తమన్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ప్రేమించింది. విజయ్ వర్మ బాలీవుడ్ లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటారు. మరి తమన్నా నిర్ణయం వెనుక కారణం ఏమిటో, ఆమె స్వయంగా చెప్పారు.

తమన్నా మాట్లాడుతూ… విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. స్త్రీల పట్ల గౌరవ భావన కలిగి ఉంటాడు. అందుకే నా మనసుకు దగ్గరయ్యాడు. విజయ్ నా జీవితంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తమన్నా చెప్పుకొచ్చారు. తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత ఆరు నెలలుగా తమన్నా-విజయ్ వర్మ లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు. అయితే తాము డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న కథనాలను తమన్నా ఖండించారు.

ఇటీవల స్పష్టత ఇచ్చారు. విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. విజయ్ వర్మ-తమన్నా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ చేశారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఒకరికొకరు దగ్గరయ్యారట. ప్రేమలో పడ్డారట. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా-విజయ్ మధ్య శృంగార సన్నివేశాలున్నాయి. నేను లిప్ కిస్ ఇచ్చిన మొదటి నటుడు విజయ్ వర్మ అంటూ తమన్నా చెప్పడం విశేషం. జూన్ 29 నుండి లస్ట్ స్టోరీస్ 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

ఇక తెలుగులో తమన్నా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. భోళా శంకర్ తమిళ చిత్రం వేదలమ్ రీమేక్ అని సమాచారం. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది. అలాగే రజినీకాంత్ తో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. జైలర్ సైతం విడుదలకు సిద్దమవుతుంది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version