Shahrukh Khan Accident: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కి షూటింగ్ చేస్తున్న సమయం లో ప్రమాదం జరిగి గాయాలు అయ్యినట్టుగా బాలీవుడ్ లో ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుంది.అభిమానుల్లో తీవ్రమైన కలవరం రేపుతోంది. ప్రస్తుతం ఆయన ‘జవాన్’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న సమయం లో ఈ ప్రమాదం చోటు చేసుకుందట.
ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ, ఆయన ముక్కు భాగం బాగా దెబ్బ తిన్నది అట. వేంటనే ఆయనని హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆయన ఇండియాకి చేరుకున్నారని, ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అయితే ఈ ప్రమాదం ఏ సమయం లో జరిగింది అనే దానిపై క్లారిటీ లేదు. మరో పక్క షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ ప్రమాదం జరిగినప్పటి నుండి మాములు స్థితి లో లేరు.
తమ అభిమాన హీరో ఎలా ఉన్నాడో ఏంటో అని ఆరాలు తీస్తూ, ఆయన తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. మళ్ళీ ఆయన సోషల్ మీడియా లో యాక్టీవ్ అయ్యి తన ఆరోగ్యం గురించి ట్వీట్ వేసేవరకు అభిమానులు ప్రశాంతం గా ఉండలేరు.ఇది ఇలా ఉండగా షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ‘పఠాన్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తో ‘జవాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలో విడుదల చేద్దామని అనుకున్నారు కానీ, షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడం తో సెప్టెంబర్ 7 వ తారీఖుకి వాయిదా వేశారు. ఈ సినిమాతో పాటుగా ఆయన బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తో ‘దుంకీ’ అనే చిత్రం లో నటిస్తున్నాడు.