Homeఎంటర్టైన్మెంట్Tamanna Bhatia: హీరోయిన్ తమన్నా కి కోలుకోలేని షాక్ ఇచ్చిన హై కోర్టు.. అసలు ఏమైందంటే..

Tamanna Bhatia: హీరోయిన్ తమన్నా కి కోలుకోలేని షాక్ ఇచ్చిన హై కోర్టు.. అసలు ఏమైందంటే..

Tamanna Bhatia: ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా(Tamanna Bhatia) కి మద్రాసు హై కోర్టు నుండి చుక్కెదురు అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తమన్నా సినిమాలతో పాటు, కమర్షియల్ యాడ్స్ కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ యాడ్స్ ద్వారా ఆమె కోట్ల రూపాయిలు సంపాదిస్తూ వచ్చింది. అందులో భాగంగా ఆమె ‘పవర్ సోప్స్ లిమిటెడ్’ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆక్టోబర్ 2 , 2008 వ సంవత్సరం లో తమన్నా ఈ కాంట్రాక్టు మీద సంతకం చేసింది. అయితే కాంట్రాక్టు గడువు తీరిపోయిన తర్వాత కూడా తన ఫోటోలను ఆ సంస్థ వాడుకుంటున్నారని, 2011 వ సంవత్సరం లో సదరు సంస్థకు కోర్టు ద్వారా నోటీసులు పంపినప్పటికీ లెక్క చెయ్యలేదని, దీంతో తన అనుమతి లేకుండా ఫోటోలు వాడుకున్నందుకు కోటి రూపాయిలు నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టుని ఆశ్రయించింది. .

ఈ కేసుని నేడు విచారించిన సింగిల్ జడ్జ్ బెంచ్, తమన్నా చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలను చూపించలేదని , ఈ కారణం చేత , పిటీషన్ కొట్టివేస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుని సవాల్ చేస్తూ , తమన్నా డివిజన్ బెంచ్ ని ఆశ్రయించారు. తాజాగా ఈ అప్పీల్ ని విచారించిన జస్టీస్ మురుగన్ , సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ , తమన్నా పిటీషన్ ని కొట్టి పారేశారు. ఇది ఆమెకు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆమె సుప్రీమ్ కోర్టుని ఆశ్రయిస్తుందా లేదా అనేది చూడాలి. యాడ్స్ ద్వారా కోట్లు సంపాదించే తమన్నా, ఒక్క కోటి రూపాయిల కోసం ఇంత దూరం వెళ్లడాన్ని చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే తమన్నా ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version