Tamanna Bhatia: స్టార్స్ వెంటపడుతుంటే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తమన్నా ఎందుకు ప్రేమించింది? సమాధానం ఇదే!

తమన్నా మాట్లాడుతూ... విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. స్త్రీల పట్ల గౌరవ భావన కలిగి ఉంటాడు. అందుకే నా మనసుకు దగ్గరయ్యాడు. విజయ్ నా జీవితంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తమన్నా చెప్పుకొచ్చారు. తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత ఆరు నెలలుగా తమన్నా-విజయ్ వర్మ లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు. అయితే తాము డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న కథనాలను తమన్నా ఖండించారు.

Written By: Shiva, Updated On : July 4, 2023 4:49 pm

Tamanna Bhatia

Follow us on

Tamanna Bhatia: తమన్నా సుదీర్ఘ కెరీర్ కలిగి ఉంది. ఆమెపై ఎఫైర్ రూమర్స్ వచ్చింది తక్కువే. టాలీవుడ్ లో తమన్నా తిరుగులేని స్టార్డం అనుభవించారు. సీనియర్స్ జూనియర్స్ అనే తేడా లేకుండా అందరితో జతకట్టింది. తమన్నాకు కోట్ల సంపాదన ఉంది. కోరుకుంటే స్టార్స్, బిజినెస్ టైకూన్స్, పొలిటీషియన్స్ క్యూ కడతారు. పోయి పోయి తమన్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని ప్రేమించింది. విజయ్ వర్మ బాలీవుడ్ లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటారు. మరి తమన్నా నిర్ణయం వెనుక కారణం ఏమిటో, ఆమె స్వయంగా చెప్పారు.

తమన్నా మాట్లాడుతూ… విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తాడు. స్త్రీల పట్ల గౌరవ భావన కలిగి ఉంటాడు. అందుకే నా మనసుకు దగ్గరయ్యాడు. విజయ్ నా జీవితంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తమన్నా చెప్పుకొచ్చారు. తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత ఆరు నెలలుగా తమన్నా-విజయ్ వర్మ లవ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు. అయితే తాము డేటింగ్ లో ఉన్నారంటూ వస్తున్న కథనాలను తమన్నా ఖండించారు.

ఇటీవల స్పష్టత ఇచ్చారు. విజయ్ వర్మను ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. విజయ్ వర్మ-తమన్నా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ చేశారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ లో ఒకరికొకరు దగ్గరయ్యారట. ప్రేమలో పడ్డారట. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా-విజయ్ మధ్య శృంగార సన్నివేశాలున్నాయి. నేను లిప్ కిస్ ఇచ్చిన మొదటి నటుడు విజయ్ వర్మ అంటూ తమన్నా చెప్పడం విశేషం. జూన్ 29 నుండి లస్ట్ స్టోరీస్ 2 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

ఇక తెలుగులో తమన్నా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా చిరంజీవికి జంటగా నటిస్తున్నారు. భోళా శంకర్ తమిళ చిత్రం వేదలమ్ రీమేక్ అని సమాచారం. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లి పాత్ర చేస్తున్నారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది. అలాగే రజినీకాంత్ తో జైలర్ చిత్రంలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. జైలర్ సైతం విడుదలకు సిద్దమవుతుంది.