Nikhil Siddharth: నిఖిల్ ‘హ్యాపీడేస్’ మూవీకి అంత తక్కువ పారితోషికం ఎందుకు తీసుకున్నాడు?

కొత్త నటులను పరిచయడం చేయడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముందుంటారు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న హీరో, హీరోయిన్లలో చాలా మంది శేఖర్ కమ్ముల సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారే. అయితే హీరో నిఖిల్ అంతకుముందే పలు సినిమాల్లో నటించారు. 2006 సంవత్సరంలో ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే చిన్న మూవీ పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి నిఖిల్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. అయితే నిఖిల్ పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు.

Written By: Chai Muchhata, Updated On : June 1, 2023 8:36 am

Nikhil Siddharth

Follow us on

Nikhil Siddharth: కొంత మంది హీరోలు ఫస్ట్ మూవీకే ఇంప్రెస్ కొట్టేస్తారు.. మరికొంత మంది కొన్ని సినిమాల్లో నటించిన తరువాత ఫేమస్ అవుతారు.. ‘ఇండస్ట్రీకి ఎప్పడు వచ్చాం.. అన్నది కాదన్నాయ్..’ అన్నట్లుగా ఎన్ని సినిమాల్లో నటించినా.. ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ అయితే నటుల జీవితమే మారిపోతుంది. అలా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు నిఖిల్. ముందుగా నటుడిగా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ గుర్తింపు రాలేదు. ఆ తరువాత ఓ మూవీకి కో డైరెక్టర్ గా పనిచేశాడు. అయినా గుర్తింపు రాలేదు. కానీ నిఖిల్ కు ‘హ్యాపీడేస్’ తో స్టార్ కలిసొచ్చింది. అయితే ఈ సినిమా కోసం ఆయన చాలా తక్కువగా పారితోషికం తీసుకున్నాడు. ఎందుకంటే?

కొత్త నటులను పరిచయడం చేయడంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముందుంటారు. ఇప్పుడు స్టార్లుగా ఉన్న హీరో, హీరోయిన్లలో చాలా మంది శేఖర్ కమ్ముల సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారే. అయితే హీరో నిఖిల్ అంతకుముందే పలు సినిమాల్లో నటించారు. 2006 సంవత్సరంలో ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే చిన్న మూవీ పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి నిఖిల్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. అయితే నిఖిల్ పేరు మాత్రం ఎక్కడా వినిపించలేదు.

కానీ 2007లో ‘హ్యాపీడేస్’లో నిఖిల్ నటించిన తరువాత ఫేమస్ అయ్యారు. ఇందులో మెయిన్ హీరో కాకపోయిన నిఖిల్ ప్రత్యేక నటనతో ఆకట్టుకోవడంతో మార్కులు కొట్టేశాడు. అయితే శేఖర్ కమ్ముల తక్కువ బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తారన్న పేరుంది. ఈ సమయంలో నటుల రెమ్యూనరేషన్ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో నిఖిల్ ఈ సినిమా కోసం రూ.25000 మాత్రమే అందుకున్నాడట. తనకు రెమ్యూనరేషన్ ముఖ్యం కాదని, స్టార్ ఇమేజ్ వస్తే ఆ తరువాత పారితోషికం పెరుగుతుందని ఆ తరువాత పలు సందర్భాల్లో చెప్పాడు.

అనుకున్నట్లుగానే నిఖిల్ ఈ సినిమా తరువాత ఫేమస్ అయ్యారు. ఆయన నటించిన ‘స్వామి రారా’ అనే మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో నిఖిల్ కు స్టార్ డం వచ్చింది. ఇక ‘కార్తీకేయ’తో నిఖిల్ మరింత ఫేమస్ అయ్యాడు. నిఖిల్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న 20వ సినిమాకు సంబంధించిన ఓ లుక్ ను జూన్ 1న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ఎపిక్ ఫాంటసీని పొలి ఉంటుందని అంటున్నారు.