Krithi Shetty
Krithi Shetty: యంగ్ బ్యూటీ కృతి శెట్టి సైతం హద్దులు దాటేస్తున్నారు. అందాల ప్రదర్శనలో తనకు సాటిలేదని నిరూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆమె వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారు కలల రాణిగా మారిపోతున్నారు. కృతి శెట్టికి కాలం కలిసి రావడం లేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. కృతి శెట్టికి బంగార్రాజు చిత్రం తర్వాత హిట్ లేదు. గత ఏడాది మూడు ప్లాప్స్ ఇచ్చింది. రామ్ పోతినేనికి జంటగా నటించిన ది వారియర్ నిరాశపరిచింది. మాచర్ల నియోజకవర్గం అంటూ నితిన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేశారు. ఈ చిత్రంలో కృతి హీరోయిన్ గా చేశారు. ఆ చిత్రం కూడా కృతికి షాక్ ఇచ్చింది.
ఇక సుధీర్ బాబు హీరోగా చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుండి అంత చెత్త సినిమా ఊహించనిదే. కథ, కంటెంట్ లేకుండా తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. ఇక కస్టడీ మూవీపై ఆశలు పెట్టుకుంటే.. అది కూడా షాక్ ఇచ్చింది.
నాగ చైతన్యకు జంటగా నటించిన కస్టడీ డిజాస్టర్ టాక్ అందుకుంది. అంటే కృతి నటించిన నాలుగు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. ఒక యంగ్ హీరోయిన్ కి ఈ పరిణామం ఆత్మహత్యా సదృశ్యం. కాబట్టి కృతికి వెంటనే హిట్ కావాలి. తెలుగులో అధికారికంగా కృతి ఒక్క సినిమాకు సైన్ చేయలేదు. ఓ మలయాళ చిత్రంతో పాటు తమిళ చిత్రం చేస్తున్నట్లు సమాచారం.
కృతికి మంచి ఆరంభం లభించింది. ఉప్పెన ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసింది. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఉప్పెన యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కాలేజ్ గర్ల్ లుక్ లో కృతి గ్లామర్ మెస్మరైజ్ చేస్తుంది. ఆ వెంటనే శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో కృతి శెట్టి హ్యాట్రిక్ పూర్తి చేసింది. దీంతో కృతికి టాలీవుడ్ లో ఇక తిరుగు లేదని భావించారు. అనూహ్యంగా ఆమె రేసులో వెనుకబడ్డారు. అందుకే తన నియమాలు పక్కన పెట్టి గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది.