https://oktelugu.com/

IPL Final 2023- Sara Ali Khan: గుజరాత్‌ ఓటమి.. ఎగిరి గంతేసిన గిల్‌ ప్రేయసి.. ట్రోల్‌ చేస్తున్న జీటీ ఫ్యాన్స్‌!

అందరూ చెన్నై విజయాన్ని ఎంజాయ్‌ చేస్తుంటే మైదానంలో ఓ యువతి జీటీ ఓటమిని ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో ఆలస్యంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 1, 2023 / 08:30 AM IST

    IPL Final 2023- Sara Ali Khan

    Follow us on

    IPL Final 2023- Sara Ali Khan: బంతి బంతికి ఫలితం చేతులు మారుతూ నరాలు తెగే ఉత్కంఠను పంచిన ఐపీఎల్‌ ఫైనల్‌ పోరులో ధోనీ సేన దుమ్మురేపింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో స్టేడియం మొత్తం ’చెన్నై.. చెన్నై..’ అంటూ నామస్మరణతో మార్మోగింది. ఆ విజయాన్ని చెన్నై టీంతోపాటు ఆ జట్టు అభిమానులు, ధోనీ ఫ్యాన్స్‌ ఇంకా ఎంజాయ్‌ చేస్తూనే ఉన్నారు. చివరి ఓవర్‌లోని ప్రతీ బాల్‌ను గుర్తుచేసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. అయితే మైదానం గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అయినా.. వచ్చిన ప్రేక్షకుల్లో 70 శాతం ధోనీ టీంకే సపోర్టు ఇవ్వడం ఇక్కడ మరో విశేషం. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టీంపై గుజరాత్‌ ఆటగాడు జడేజా విన్నింగ్‌ షాట్‌ కొట్టడం మరో విశేషం.

    జీటీ ఓటమిని ఎంజాయ్‌ చేసిన సారా..
    అందరూ చెన్నై విజయాన్ని ఎంజాయ్‌ చేస్తుంటే మైదానంలో ఓ యువతి జీటీ ఓటమిని ఎంజాయ్‌ చేస్తున్నట్లు కనిపించింది. ఈ వీడియో ఆలస్యంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే అలా ఎంజాయ్‌ చేసిన యువతి ఎవరో కాదు.. గిల్‌ ప్రేయసిగా చెబుతున్న సారా అలీ ఖాన్‌. బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఫైనల్‌ మ్యాచ్‌ కు హాజరైన సారా, ఆఖరి బంతికి చెన్నై విజయం అందుకోగానే కేరింతలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

    సారా – గిల్‌ డేటింగ్‌..
    ఇదిలా ఉండగా, శుభ్‌మన్‌ గిల్, సారా అలీఖాన్‌ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ ఓ హోటల్‌ నుంచి బయటకొస్తూ కెమెరా కంట పడ్డారు. ఆపై ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణిస్తూ తమ రిలేషన్‌షిప్‌పై క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ప్రియుడి జట్టు ఓటమి పాలైతే.. బాధపడాలి. కానీ ఇక్కడ సారా అలీఖాన్‌ సంబరాలు చేసుకుంది. ఇది స్పోర్ట్స్‌మెన్‌షిప్‌లో భాగమైన గిల్‌ అభిమానులకు రుచించడం లేదు. ‘ఓటమి బాధలో ఉన్న గిల్‌ ను ఓదార్చాల్సింది పోయి ఎంజాయ్‌ చేస్తావా?’ అంటూ గుజరాత్‌ ఫ్యాన్స్‌ సారాను ట్రోల్‌ చేస్తున్నారు.