Kalki Movie: తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బాహుబలి తో బాలీవుడ్ లోకి తనదైన రీతిలో ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పటినుంచి అక్కడ తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను సాధించాయి. అందువల్లే ఆయనకి మంచి ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.
ఇక ప్రస్తుతం ఆయన కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేసే పనుల్లో ప్రభాస్ తరుచుగా ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై తిరుగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కల్కి సినిమా మీద బాలీవుడ్ లో నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ మాఫియా ప్రభాస్ సినిమాకి భారీ కలెక్షన్లు రావద్దని ఉద్దేశ్యంతోనే సెకండ్ ట్రైలర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా మీద నెగిటివ్ కామెంట్లైతే చేస్తున్నారు. మరి దానికి కారణం బాలీవుడ్ మాఫియా అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ మాఫియా ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ లో ఉందనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్లు ఎలాగైనా సరే ప్రభాస్ ను తొక్కేయాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan : పిక్ ఆఫ్ ది డే : రేణుదేశాయ్ పిల్లలతో అన్నాలెజ్నోవా.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
ఇక ఇంతకుముందు సలార్ సినిమా సమయంలో కూడా ఇలాగే చేసి ఆ సినిమాకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ సినిమా మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు కూడా కల్కి సినిమా విషయంలో మరోసారి అలాంటి వైఖరినే అనుసరిస్తున్నారు. మరి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయి బాలీవుడ్ మాఫియా కి బుద్ధి చెబుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…