Kalki 2898 AD: కల్కి మూవీ అన్ని వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందా..? సక్సెస్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రావాలంటే..?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పాగా వేసిన ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

Written By: Gopi, Updated On : June 23, 2024 1:58 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో పాగా వేసిన ప్రభాస్ ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ సినిమాతో 700 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన ప్రభాస్ ఇప్పుడు మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకొని పాన్ ఇండియాలో తనను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అనేలా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఈ సినిమాతో కనక భారీ సక్సెస్ ని అందుకుంటే ఇక తన రేంజ్ ని టచ్ చేసే హీరోలు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక సినిమా యూనిట్ ప్రస్తుతం రోజుకొక అప్డేట్ ను ఇస్తూ సినిమా మీద తారా స్థాయిలో అంచనాలు పెంచేశారు.

ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తం గా 385 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన బిజినెస్ ను అయితే చేసింది. ఇక అందులో భాగంగానే నైజాం రైట్స్ ను 70 కోట్ల కు అమ్మగా, సీడేడ్ 27 కోట్లు, ఆంధ్ర 83 కోట్లకు అమ్ముడుపోయాయి.

ఇక అదే విధంగా కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడు లో 16 కోట్లు, హిందీలో 85 కోట్లు,కేరళ లో 6 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్ల బిజినెస్ చేసింది. ఇక దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 385 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకుంది. ఇక 385 కోట్లకు పైన కలెక్షన్ల ను వసూలు చేస్తేనే ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరి దానికి అనుకూలంగానే ఈ సినిమా మీద భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…