https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున పక్కనే ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడొక స్టార్ హీరో అనే విషయం మీకు తెలుసా..?

Nagarjuna: 'ఆవిడ మా ఆవిడే' ఈ సినిమాని ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో చేసిన నాగార్జున ఈ సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : June 24, 2024 / 10:03 AM IST

    Allari Naresh Childhood Pics

    Follow us on

    Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున క్లాస్ సినిమాలను చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక దాంతో పాటు గా లవ్ స్టోరీస్, రొమాంటిక్ సినిమాలను చేయడంలో కూడా నాగార్జున తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన కన్ఫ్యూజన్ డ్రామాలను కూడా ఎక్కువగా చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు.

    ఇక ఇలాంటి క్రమంలో వచ్చిందే ‘ఆవిడ మా ఆవిడే’ ఈ సినిమాని ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో చేసిన నాగార్జున ఈ సినిమాతో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడనే చెప్పాలి. ఇక రెండు పాత్రల్లో ఒక్కడే నటిస్తూ తన కష్టాలను ఈ సినిమాలో మనకు చాలా కామెడీగా చూపించారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగార్జున తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగార్జునకి వరుసగా హలో బ్రదర్, సిసింద్రీ, నిన్నేపెళ్లడుతా, అన్నమయ్య లాంటి సినిమాలు మంచి సక్సెస్ లను సాధించాయి.

    Also Read: Pawan Kalyan : పిక్ ఆఫ్ ది డే : రేణుదేశాయ్ పిల్లలతో అన్నాలెజ్నోవా.. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫోటో వైరల్

    ఇక దాంతో ఒక్కసారి గా ఆయన టైర్ వన్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఇక ఇదిలా ఉంటే పైన ఫోటోలో ఆయన పక్కన నిలుచున్న కుర్రాడు ఎవరో ఇప్పటికీ మీరు గుర్తుపట్టే ఉంటారు. ఇక కొంతమంది నాగచైతన్య అని అనుకుంటున్నారు. కానీ నాగచైతన్య కాదు. లెజండరీ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారి కొడుకు అయిన ‘అల్లరి నరేష్’.. ‘అల్లరి ‘ సినిమాతో ఇండస్ట్రీకి ఏంట్రీ ఇచ్చిన నరేష్ ప్రస్తుతం ఇప్పటికి కూడా హీరోగా కొనసాగుతూ వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఆవిడ మా ఆవిడే సినిమా చేసిన సమయంలో నాగార్జునతో నరేష్ ఈ ఫోటో దిగినట్టుగా తెలుస్తుంది. రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అల్లరి సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన నరేష్ మొదటి సినిమాలోనే ఒక డిఫరెంట్ పాత్ర లో నటించి మెప్పించాడు.

    Also Read: Kalki 2898 AD: కల్కి మూవీ అన్ని వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుందా..? సక్సెస్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రావాలంటే..?

    ఇక ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఆయన జూనియర్ రాజేంద్ర ప్రసాద్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన కామెడీ రొటీన్ కామెడీ అయిపోవడంతో మధ్యలో కొద్ది రోజుల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన నాంది సినిమా చేసి మంచి సక్సెస్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడనే చెప్పాలి.