Loan : జీవితంలో ఎంత సంపాదించినా అత్యవసర సమయంలో డబ్బు లేకపోతే చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఆసుపత్రిలో నగదు అవసరం ఏర్పడిన సమయంలో ఇతరులను అడిగితే వెంటనే ఇచ్చే పరిస్థితి ఉండదు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. ఇలాంటి సమయంలో బ్యాంకు నుంచి అత్యవసర లోన్ ఇస్తారు. అయితే కొన్ని బ్యాంకులు అత్యవసర లోన్ కు ఎక్కువ వడ్డీ రేటు విధించే అవకాశం ఉంది. ఈ రేటు 15 శాతం వరకైనా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో ఈ చిన్న ఐడియా ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు. అదెలాగంటే?
బ్యాంకులో అనేక రకాల రుణ సదుపాయాలు ఉంటాయి. చాలా మందికి ఈ విషయం తెలియక కొన్ని అవసరాల నిమిత్తం అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటారు. అయితే ఆయా అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం వల్ల సంబంధిత వడ్డీరేటును బ్యాంకులు విధిస్తాయి. పర్సనల్ లోన్ విషయంలో వడ్డీ రేటు ఎక్కువగానే ఉంటుంది. అదే హోమ్ లోన్ వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అయితే హోమ్ లోన్ ను సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.
మరి అత్యవసర సమయంలో తక్కువ వడ్డీకే లోన్ పొందాలంటే ఈ సదుపాయం అదేంటంటే.. ఉదాహరణకు ఆసుపత్రిలో లక్ష రూపాయలు అర్జంటుగా కట్టాలి. ఇలాంటి సమయంలో బ్యాంకులో ఇప్పటికే హోమ్ లోన్ ఉంటే… దాని అధారంగా టాప్ అప్ లోన్ ను ఇస్తారు. అంటే హోమ్ లోన్ ఆధారంగా మరో లోన్ ఇస్తారన్నమాట. ఇలా లోన్ తీసుకోవడం వల్ల వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా హోమ్ లోన్ పై 9 శాతం వడ్డీ రేటు విధిస్తారు. దీనిపై టాప్ అప్ లోన్ తీసుకుంటే అదనంగా 0.5 వడ్డీ రేటు పెంచుతారు. అంటే 9.5 శాతం వడ్డీ రేటుతో టాప్ అప్ లోన్ ఇస్తారు.
టాప్ అప్ లోన్ తీసుకోవడానికి ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకుని ఉంటారు. వాటిని ఆధారంగా చేసుకొని ఈ లోన్ ఇస్తారు. అంతేకాకుండా టాప్ అప్ లోన్ కు సంబంధించి ఈఎంఐ టెన్యూర్ హోమ్ లోన్ తో సమానంగా పెట్టుకోవచ్చు. రెగ్యులర్ హోమ్ లోన్ ఈఎంఐతో పాటు టాప్ అప్ ఈఎంఐని కూడా చెల్లించాలి. ఇలా అత్యవసర సమయాలో తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు.