https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: ఈ వారం ఆ ఇద్దరిలో ఏ లేడీకి మూడిందో ?

Bigg Boss 5 Telugu: ఈసారి కూడా బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలదే అంటున్నారు. ఈ విషయంలో సన్నీ షణ్ముఖ్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. మొదటి నుండి అగ్రెసివ్ గేమ్ ఆడుతున్న సన్నీ అనూహ్యంగా పుంజుకొని టైటిల్ రేసులోకి వచ్చాడు. కొన్నాళ్లుగా షణ్ముఖ్ పేరు వినిపిస్తుండగా ఇప్పుడు సన్నీ కూడా టైటిల్ విన్నర్ కావచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సింగర్ శ్రీరామ చంద్ర, హీరో మానస్ ని పక్కన పెట్టడానికి లేదు. వీరిద్దరు కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : December 1, 2021 / 04:20 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: ఈసారి కూడా బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలదే అంటున్నారు. ఈ విషయంలో సన్నీ షణ్ముఖ్ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. మొదటి నుండి అగ్రెసివ్ గేమ్ ఆడుతున్న సన్నీ అనూహ్యంగా పుంజుకొని టైటిల్ రేసులోకి వచ్చాడు. కొన్నాళ్లుగా షణ్ముఖ్ పేరు వినిపిస్తుండగా ఇప్పుడు సన్నీ కూడా టైటిల్ విన్నర్ కావచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో సింగర్ శ్రీరామ చంద్ర, హీరో మానస్ ని పక్కన పెట్టడానికి లేదు.

    Bigg Boss 5 Telugu Kajal and Priyanka Singh

    వీరిద్దరు కూడా ట్రోపి కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. ఇండియన్ ఐడల్ గెలుచుకున్న శ్రీరామ చంద్రకు బుల్లితెర ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక మానస్ కు సామాజిక వర్గ సమీకరణాలు దోహదం చేశాయి అంటున్నారు. ఏది ఏమైనా మరో మూడు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. అయితే ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు.

    రవి ఎలిమినేషన్ తర్వాత సన్నీ, షణ్ముఖ్, మానస్, శ్రీరామ చంద్ర, కాజల్, సిరి, ప్రియాంక మిగిలారు. వీరి నుండి ఇద్దరు ఎలిమినేట్ కానుండగా.. ఐదుగురు ఫైనల్ కి వెళతారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కత్తి ముగ్గురిపై వేలాడుతుందని సమాచారం. కాజల్, సిరి, ప్రియాంకలలో ఒకరు ఎలిమినేట్ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    Also Read: బిగ్ బాస్ టైటిల్ మా క్యాస్ట్ వాడే కొట్టాలి… అరె ఎటు పోతుందిరా ఈ సమాజం!
    హౌస్ లో ఉన్నవారిలో అతి తక్కువ ఓట్లు రాబట్టిన సిరి, ప్రియాంక, కాజల్ లలో ఒకరు హౌస్ ని వీడనున్నారట. గత వారం ఎలిమినేషన్ లో చివరి అంచుల వరకు వెళ్లిన కాజల్ ఎలిమినేట్ అయ్యే ఆస్కారం లేదని, ప్రేమ పక్షులుగా ఉన్న సిరి, ప్రియాంకలలో ఒకరు అవుట్ అంటున్నారు. ప్రతిసారి ప్రచారం అవుతున్నట్లుగానే ఎలిమినేషన్ జరుగుతుంది.

    మరి ఈసారి కూడా ఊహాగానాలు నిజమైతే ఓ లేడీ కంటెస్టెంట్ హౌస్ కి గుడ్ బై చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు యాంకర్ రవి ఎలిమినేషన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఓట్లతో సంబంధం లేకుండా అన్యాయంగా రవిని హౌస్ నుండి బయటకు పంపారని అంటున్నారు. కాజల్, సిరి, ప్రియాంక కంటే కూడా రవికి తక్కువ ఓట్లు రావడం జరగని పని అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: మన్మధరాజాలకే బిగ్ బాస్ టైటిలా? ఇదేం లాజిక్ రా బాబు!

    Tags