https://oktelugu.com/

KCR Behind: కేసీఆర్ తిట్ల బాగోతం.. వెనుక ఉన్నది అతడేనా?

KCR Behind: కొంతకాలంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ వ్యూహాల కారణంగానే తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. గడిచిన ఏడేళ్ల కాలంలో టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగా ప్రతిపక్ష పార్టీలు తెలంగాణలో బలాన్ని పుంజుకుంటున్నాయి. దీంతో కేసీఆర్ కు ఫ్రస్టేషన్ అమాంతం పెరిగిపోతుందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా తెలంగాణలో బీజేపీ ఆవిర్భావించింది. కేంద్రంలో బీజేపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2021 / 04:11 PM IST
    Follow us on

    KCR Behind: కొంతకాలంగా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ వ్యూహాల కారణంగానే తెలంగాణలో టీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. గడిచిన ఏడేళ్ల కాలంలో టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా సాగింది. అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగా ప్రతిపక్ష పార్టీలు తెలంగాణలో బలాన్ని పుంజుకుంటున్నాయి. దీంతో కేసీఆర్ కు ఫ్రస్టేషన్ అమాంతం పెరిగిపోతుందనే టాక్ విన్పిస్తోంది.

    KCR

    తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా తెలంగాణలో బీజేపీ ఆవిర్భావించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని స్థానిక బీజేపీ నేతలు చక్కగా వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ వైఫ్యల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకెళుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ ఎక్కువగా ఆదరిస్తున్నారు.

    ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కు కనీసం మూడువేల ఓట్లు కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో టీఆర్ఎస్ సైతం అలర్ట్ అవుతోంది. ఇన్నాళ్లు బీజేపీని లైట్ తీసుకున్న కేసీఆర్ తమ తొలి ప్రత్యర్థి ఇక బీజేపీనే అన్నట్లుగా మారిపోయారు.

    సీఎం కేసీఆర్ ఇటీవల వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ కేంద్రం, తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా బీజేపీ నేతలపై పరుష పదజాలంతో తిట్లపురాణాన్ని అందుకున్నారు. కేంద్ర మంత్రి, స్థానిక బీజేపీ నేత కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడం కన్పించింది.

    అయితే కేసీఆర్ అలా మాట్లాడానికి పొలిటికల్ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోరే కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయన సలహాలతోనే కేసీఆర్ దిగజారిపోయి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా మాట్లాడటం, మహిళలను, కుటుంబ సభ్యులను కించపర్చేలా మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే జరుగుతుంటాయని చెబుతున్నారు.

    Also Read: కిషన్ రెడ్డిపై కేసీఆర్ విమర్శల్లో మర్మమేమిటి?

    ప్రశాంత్ కిషోర్ వల్లే ఏపీ పాలిటిక్స్ సర్వనాశనం అయ్యాయని వారంతా గుర్తు చేస్తున్నారు. తెలంగాణలోనూ ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ కోసం పని చేస్తూ తెలంగాణను కూడా భ్రష్టుపట్టించేలా పనులు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారా? లేదా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంటుంది.

    దీనిపై టీఆర్ఎస్ వర్గాలు గానీ అటు ప్రశాంత్ కిషోర్ టీంగానీ తెలంగాణ రాష్ట్ర సమితి తరుపున పని చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. అయితే రాబోయే రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా సీఎం కేసీఆర్ తనదైన వ్యూహాలు రచిస్తున్నారనే కామెంట్స్ సైతం విన్పిస్తున్నాయి.

    Also Read: కేసీఆర్ టార్గెట్ బీజేపీ.. అసలు కారణం ఇదేనా?

    Tags