Telugu Film Industry: సీతారామశాస్త్రి గారు సాధారణ ప్రేక్షకులలో కూడా సాహిత్యంపై గౌరవం పెంచారు. ఆయన ఇక లేరు. మరి ఇక అద్భుతమైన సాహిత్యం రాసేవారు ఏరి ? అని నేడు అందరూ తెగ బాధ పడుతున్నారు. వాస్తవానికి గత కొన్ని ఏళ్లుగా సినిమా రచయితలు తగ్గిపోతున్నారు. సేవ్ టైగర్ లాగే, సేవ్ రైటర్ అంటూ కొరటాల శివ లాంటి వ్యక్తి చెప్పాడంటే.. దాని వెనుక బాధ ఒక్కటే కాదు, ఆలోచన కూడా ఉంది.

ఈ మధ్య తెలుగు సినిమా పరిశ్రమలో కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం ఈ మూడు విభాగాలూ ఒక దర్శకులే చేస్తున్నారు. ఒకప్పుడు దర్శకులు, కథా రచయితలు, స్క్రీన్‌ప్లే రచయితలు వేర్వేరుగా ఉండేవారు. దాంతో ఇండస్ట్రీకి కొత్త కొత్త రచయితలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు రోజులు పూర్తిగా మారాయి.
ఓ సినిమా దర్శకుడిగా అవకాశం తెచ్చుకోవాలంటే ఏళ్ల తరబడి ఎవరెవరి వద్దనో సహాయ దర్శకులుగా పనిచేయాల్సిన అవసరం లేకుండా పోయింది. సొంత కథల్ని పాకెట్ మనీతో లఘు చిత్రంగా మలిచి తామేంటో నిరూపించుకుని, దాని సాయంతో ఏకంగా పూర్తిస్థాయి దర్శకులుగా మారుతున్న వారి సంఖ్య నేటి తరంలో ఎక్కువగా ఉంది.
Also Read: పాత చిత్రాలే గొప్ప చిత్రాలుగా ఎందుకు నిలిచిపోయాయి ?
దాంతో రచయితల కోసం దర్శకులు ఎదురు చూడటం లేదు. దాంతో రచయితలు కూడా దర్శకత్వం పైనే అవగాహన పెంచుకుని.. తమ కథలతో దర్శకులుగా మారిపోతున్నారు. తమ కథలకి తామే స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రాసుకుంటున్నారు. అయితే, ఇలా ఈ మూడు విభాగాలూ ఒక్కరే మోయటం వల్ల లాభాలు కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయనేదీ ఇక్కడ ప్రశ్న.
అయితే, ఈ మూడు విభాగాలు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మూడూ బాగా కుదిరినప్పుడు వాటి వెనకున్నది ముగ్గురా, ఒకరా అన్నది ప్రశ్నే కాదు. కానీ కుదరనప్పుడే అసలు సమస్య ఉంటుంది. నిర్మాతకు నష్టాలే మిగులుతాయి. శేఖర్ కమ్ముల లాంటి దర్శకుడే తన సినిమాలకి కథలూ, సంభాషణలూ రాసుకుంటే.. ఒక్కోసారి అవి అంత ప్రతిభావంతంగా అనిపించవు. కాబట్టి అన్ని ఒక్కరే చేయడం ఎప్పటికీ మంచిది కాదు.
Also Read: ఆహా లో సందడి చేసేందుకు సిద్దమైన “పుష్పక విమానం” సినిమా…