https://oktelugu.com/

Star Actress: రజినీకాంత్ సినిమాలో చిన్న పాత్ర చేసి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?

కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'లింగా ' సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారినప్పటికీ, రజినీకాంత్ కెరియర్ లో ఇదొక బెస్ట్ అటెంప్ట్ గా మిగిలిపోయింది.

Written By:
  • Gopi
  • , Updated On : March 28, 2024 / 12:39 PM IST

    Amritha Aiyer played a small role in Rajinikanth movie

    Follow us on

    Star Actress: సినిమా ఇండస్ట్రీలో ఏ రోజు ఎవరు ఇలాంటి పొజిషన్ లో ఉంటారో చెప్పడం చాలా కష్టం.. ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నవారు రేపటి రోజున సినిమాలు లేక ఖాళీగా ఉండే పరిస్థితి రావచ్చు. అలాగే ఇవాళ్ళ చిన్నచితక క్యారెక్టర్లు చేసుకునే నటులు కూడా రేపు స్టార్ హీరోలుగా వెలుగొందొచ్చు. సినిమా అనేది రంగుల ప్రపంచం ఇక్కడ కొంతమంది జీవితాలు సాఫీగా సాగిపోతుంటే, మరి కొంత మంది జీవితాలు అంధకారంలో మిగిలిపోతూ ఉంటాయి.

    ఇక సినిమా అనే పిచ్చితో వచ్చిన చాలామంది చాలా రకాల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంటుంటే, ఇక మరికొందరికి మాత్రం ఇక్కడ సరైన గుర్తింపు రావట్లేదు. ఇక ఇది ఇలా ఉంటే రజినీకాంత్ హీరోగా గత సంవత్సరం వచ్చిన జైలర్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ పర్ఫామెన్స్ పిక్స్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఈ వయసులో కూడా తను సూపర్ డూపర్ సక్సెస్ ని అందించాడు అంటే రజనీకాంత్ స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్టు కొడితే చాలు ఇప్పుడున్న యంగ్ హీరోలు గర్వంతో విర్రవిగుతుంటు ఉంటారు. కానీ రజనీకాంత్ మాత్రం తన కెరియర్ లో ఎన్నో సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్న కూడా ఇప్పటికీ ఒక కొత్త నటుడి లాగే సినిమాల్లో నటిస్తూ సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు.

    ఇక ఇదిలా ఉంటే 2014 వ సంవత్సరంలో రజనీకాంత్ హీరోగా కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘లింగా ‘ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారినప్పటికీ, రజినీకాంత్ కెరియర్ లో ఇదొక బెస్ట్ అటెంప్ట్ గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమాలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది. ఇక హీరోయిన్ పక్కన ఉండే ఒక చిన్న క్యారెక్టర్ లో నటించిన నటికీ అప్పట్లో గుర్తింపు అయితే రాలేదు. కానీ ఆమె ఇటీవల స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆమె ఎవరు అంటే రామ్ హీరోగా నటించిన ‘రెడ్ ‘ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గాపరిచయమైన ‘అమృత అయ్యార్’ ఈ ముద్దుగుమ్మ రెడ్ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

    ఇక ఈ సంవత్సరం రిలీజ్ అయిన హనుమాన్ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆమె ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన సినిమాల్లో నటించేందుకు అవకాశాలను కూడా అందుకుంటుంది. ఇక హనుమాన్ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి ఈ సంవత్సరం ఇప్పటివరకు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది…ఇక ఈ సినిమాతో అమృత అయ్యర్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అవడంతో ఇంతకు ముందు ఆమె ‘లింగా ‘ సినిమాలో చేసిన సీన్లు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…