https://oktelugu.com/

Rajinikanth: రజినీకాంత్ ను హేళన చేసిన ప్రొడ్యూసర్…మాస్ రివెంజ్ తీర్చుకున్న సూపర్ స్టార్…

రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఒక ప్రొడ్యూసర్ రజనీకాంత్ తో ఒక క్యారెక్టర్ చేయించడానికి...

Written By: , Updated On : March 25, 2024 / 11:01 AM IST
Producer insulted Rajinikanth

Producer insulted Rajinikanth

Follow us on

Rajinikanth: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న హీరో రజనీకాంత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేటు గుర్తింపుని సంపాదించుకున్న తర్వాత ఆయన సినిమాలని తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అయితే సంపాదించుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి సమయంలోనే ఒక ప్రొడ్యూసర్ రజనీకాంత్ తో ఒక క్యారెక్టర్ చేయించడానికి తనకు 6 వేల రూపాయలను రెమ్యూనరేషన్ గా ఒప్పుకున్నాడట. అయితే దాంట్లో అడ్వాన్స్ గా కొంత డబ్బు ఇవ్వాలని రజనీకాంత్ అడగగా రేపు షూటింగ్ స్పాట్లోకి వచ్చిన తర్వాత 1000 రూపాయల అడ్వాన్స్ ఇస్తామని చెప్పారట. ఇక షూటింగ్ స్పాట్ కి వెళ్లి మేకప్ వేసుకున్న రజనీకాంత్ అప్పుడు మేనేజర్ ని పిలిచి 1000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తానన్నారు ఇవ్వండి అని అడిగాడట.

ఇక అక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్ నువ్వేదో మూడు, నాలుగు సినిమాలు చేసి, ఇప్పుడే అడ్వాన్సులు అవి ఇవి అంటూ పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన క్యారెక్టర్ కూడా నీకు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడట. తనని తన ఇంట్లో డ్రాప్ చేయమని అడగగా నీకు కారు కూడా ఎక్కువే నడుచుకుంటూ వెళ్ళు అంటూ కోపానికి వచ్చిన రజినీకాంత్ ఈ ఏవియం స్టూడియోలో నన్ను అవమానించావు కదా ఇదే ఏవియం స్టూడియోకి నేను కారు వేసుకుని వచ్చే రేంజ్ కు వెళ్లకపోతే నా పేరు ‘రజనీకాంత్ ‘ కాదని సవాల్ చేశాడట.

తను అనుకున్నట్టుగానే ఓన్లీ 2 ఇయర్స్ లోనే రజినీకాంత్ గొప్ప పేరు సంపాదించుకొని ఒక కొత్త కారు కొనుక్కుని అదే ఎవియం స్టూడియోకి వచ్చి ఎక్కడైతే అవమానం చెందాడో అక్కడే కాలు మీద కాలు వేసుకొని కూర్చోని రెండు సిగరెట్లు తాగాడట. ఇక అక్కడికి వచ్చిన ప్రొడ్యూసర్ కి రజనీకాంత్ తన రేంజ్ ఏంటో చూపించాడట. ఇక మొత్తానికైతే రజనీకాంత్ ఒక భారీ రివెంజ్ తీర్చుకున్నాడనే చెప్పాలి…