Rishab Shetty: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ప్రస్తుతం కొత్త కథలతో సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాలకి పాన్ ఇండియాలో మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఇక ఇదిలా ఉంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి కాంతార అనే సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి… కాంతార సినిమా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని అందుకుంది. ఇక దాంతో పాటుగా ఆయన చేయబోయే ప్రతి సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి.
ఇక అందులో భాగంగానే కాంతార 2 సినిమాని కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘హనుమాన్ ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ప్రశాంత్ వర్మ కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 సినిమాని చేసే పనిలో బిజీగా ఉన్నప్పటికీ, రిషబ్ శెట్టి ని హీరోగా పెట్టి ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికైతే అటు రిషబ్ శెట్టి కాంతార 2 తో, ఇటు ప్రశాంత్ వర్మ హనుమాన్ 2 తో చాలా బిజీగా ఉన్నారు.
ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో ఒక భారీ గ్రాఫికల్ సినిమా రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిజానికి రిషబ్ శెట్టి తనే డైరెక్టర్ గా, హీరోగా సినిమాలు చేస్తూ ముందుకు కదులుతున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తను హీరోగా చేయడానికి ఒప్పుకోవడం అనేది కూడా ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి. ఇక రిషబ్ శెట్టి వైవిధ్యమైన చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
ఆయన కన్నడలో తీసిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇక తన ఫ్రెండ్ అయిన రాజ్ బి శెట్టి డైరెక్షన్ లో వచ్చిన ‘గరుడ గమన వృషభ వాహన’ అనే సినిమాలో కూడా తను హీరోగా నటించి మెప్పించాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ఆయన ప్రశాంత్ వర్మ తో చేయబోయే సబ్జెక్టు కూడా చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అఫీషియల్ గా ఈ సినిమాను అనౌన్స్ చేయాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…