Bollywood: అసలు బాలీవుడ్ ఇండస్ట్రీ అలా అవ్వడానికి కారణం ఎవరు..?

రీసెంట్ గా అట్లీ డైరెక్టన్ లో షారుఖ్ ఖాన్ హీరో గా వచ్చిన జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది.

Written By: Gopi, Updated On : September 11, 2023 6:06 pm

Bollywood

Follow us on

Bollywood: సినిమా అంటే అందరికి చాలా ఇష్టం ఉంటుంది ఇప్పుడు అన్ని భాష ల సినిమాలు మనకు ఓటిటి లో అందుబాటు లో ఉండటం తో అందరు అన్ని సినిమాలు చూస్తున్నారు అయితే ఒక్కసారి గా బాలీవుడ్ హీరోల గ్రెస్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అనేది చాలామంది కి తెలియని ఒక ప్రశ్న గా మిగిలిపోయింది. అయితే తెలుగు లో ఉన్న టాప్ హీరోలకి బాలీవుడ్ లో ఉన్న హీరోలకి మధ్య తేడా ఏంటి ఎందుకు వాళ్ల సినిమాలు ఎక్కువగా ఆడటం లేదు ఇండియాలో ఉన్న టాప్ డైరెక్టర్లు అందరు మన హీరో ల వెంటే ఎందుకు పడుతున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాజమౌళి ముందుగా బాహుబలి సినిమాని అమీర్ ఖాన్ హీరో గా పెట్టి చేద్దాం అనుకున్నాడు కానీ సౌత్ డైరెక్టర్లు అంటే కొంత మేరకు చిన్న చూపు ఉన్న బాలీవుడ్ హీరోలలో ఒకడైన అమీర్ ఖాన్ కూడా ఆ సినిమా చేయదానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు మన తెలుగు డైరెక్టర్లకి సినిమాలు తీయడం కూడా రాదు అని బాలీవుడ్ మీడియా చాలా సార్లు ఓపెన్ గా చెప్పింది.అయితే బాహుబలి తో రాజమౌళి ఒక తెలుగువాడు సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది బాలీవుడ్ లో ఉన్న హీరోలకి డైరెక్టర్లందరికి చూపించడం జరిగింది.ఇక దాంతో బాలీవుడ్ అభిమానులందరికి సౌత్ సినిమాలు నచ్చడం స్టార్ట్ అయింది అందులోను తెలుగు సినిమా అంటే చాలు బాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం ఎదురుచూడటం మొదలు పెట్టారు దాంతో మన సినిమాలు అక్కడ బిగ్గెస్ట్ హిట్లు గా కూడా నిలిచాయి…

ఒక వంతుకు బాలీవుడ్ హీరోలు వాళ్ళంతట వల్లే ఈ పరిస్థితి ని తెచ్చుకున్నారు అని చెప్పాలి.అందుకే వాళ్ళు ఇప్పుడుహిట్లు కొట్టాలి అంటే వాళ్ళకి సౌత్ డైరెక్టర్లు కావాలి అందుకే అట్లీ, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు హిట్లు కొడుతున్నారు…అందులో భాగంగానే రీసెంట్ గా అట్లీ డైరెక్టన్ లో షారుఖ్ ఖాన్ హీరో గా వచ్చిన జవాన్ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకెళ్తుంది…మన హీరోలకి వాళ్ళకి తేడా ఏంటంటే మనవాళ్ళు డౌన్ టు ఎర్తు ఉంటారు, కానీ వాళ్ళు మాకంటే తోపులు లేరు అని అనుకుంటారు అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఇప్పుడు ఈ గతి పట్టింది…