Music Directors: అప్పటి మ్యూజిక్ డైరెక్టర్లకు ఇప్పుడున్న వాళ్లకి తేడా ఏంటంటే..?

ఒకపుడు కీరవాణి, ఇళయరాజా, ఎస్ ఏ రాజ్ కుమార్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు సమకూర్చిన మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ వింటే అవి ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి.

Written By: Gopi, Updated On : September 11, 2023 6:11 pm

Music Directors

Follow us on

Music Directors: సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో చాలా మంది వాళ్ల మ్యూజిక్ తో చాలా సినిమాలని హిట్ అయ్యేలా చేసారు.అప్పట్లో కొన్నిసినిమాలు పాటలతోనే చాలా సక్సెస్ లు సాధించాయి.అంటే ఒకప్పుడు చాలా సినిమాలు మ్యూజిక్ ద్వారానే ఆడాయి అనే చెప్పాలి అప్పట్లో సాంగ్స్ చాలా బాగుండేవి లిరిక్స్ కూడా మనకు వినడానికి చాలా వినసొంపు గా ఉండేవి తలనొప్పి వస్తే ఆ సాంగ్స్ వింటే తలనొప్పి తగ్గిపోయేది.కానీ ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కొట్టిన మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ వింటే మాత్రం మనకు నిజంగానే తలకాయ నొప్పి వస్తుంది అనడం లో ఎంత మాత్రం సందేహంలేదు…

ఒకపుడు కీరవాణి, ఇళయరాజా, ఎస్ ఏ రాజ్ కుమార్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు సమకూర్చిన మ్యూజిక్ లో వచ్చిన సాంగ్స్ వింటే అవి ఇప్పటికి కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి.అందుకే మనం పడుకునే సమయం లో ఇప్పటికీ కూడా ఆ ఓల్డ్ సాంగ్స్ ని వినుకుంటూనే ఉంటాం..అయితే అప్పటి మ్యూజిక్ డైరెక్టర్లకి ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్లకి తేడా ఏంటి అంటే అప్పుడున్న డైరెక్టర్లు సినిమా లో అన్ని రకాల సాంగ్స్ ఉండేలా చూసుకునేవారు కానీ ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర నుంచి సాంగ్స్ ఎలా ఉన్న పర్లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటే చాలు అన్నట్లు గా చూస్తున్నారు.అందుకే సాంగ్స్ కంటే కూడా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాటిని ఎలివేట్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు…