Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 Release Date: ఉత్కంఠకు తెర పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు... పుష్ప 2 రిలీజ్ డేట్...

Pushpa 2 Release Date: ఉత్కంఠకు తెర పుష్పరాజ్ వచ్చేస్తున్నాడు… పుష్ప 2 రిలీజ్ డేట్ ఫిక్స్!

Pushpa 2 Release Date: భారీ ఉత్కంఠకు తెరపడింది. మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2 విడుదల తేదీ ప్రకటించేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప సెట్స్ పైకి వెళ్లే వరకు కూడా సుకుమార్ పార్ట్ 2 ఆలోచన చేయలేదు. బలమైన కథ, రెండు భాగాలు చెప్పే స్కోప్ ఉందని భావించి పుష్ప 2 కూడా ప్రకటించారు. పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా ఆడియన్స్ పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ‘వేర్ ఈజ్ పుష్ప?’ కాన్సెప్ట్ టీజర్ కి భారీ రెస్పాన్స్ దక్కింది. హిందీ టీజర్ కి తెలుగు మించిన ఆదరణ దక్కడం విశేషం. దీన్ని బట్టి నార్త్ లో అల్లు అర్జున్ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. 2023లోనే పుష్ప 2 విడుదల ఉంటుందని అందరూ భావించారు. పార్ట్ 1 చిత్రీకరణ సమయంలో కొంత పార్ట్ 2 షూటింగ్ చేశారనే వాదన వినిపించింది.

అయితే సుకుమార్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారు. బడ్జెట్ కూడా రెండింతలు పెంచారు. ఈ క్రమంలో మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఆలస్యమైంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్స్ లో చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఇక పుష్ప 2 విడుదల 2024 సమ్మర్ కి ఉంటుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ వెల్లడించారు.

ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని 2024 ఆగస్టు 15న పుష్ప 2 విడుదల చేస్తున్నారు. పుష్ప 2 విడుదల తేదీ ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పుష్ప 2 చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్, ఫహాద్ ఫాజిల్ విలన్. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ దాదాపు రూ. 350 కోట్లని సమాచారం. విడుదలకు ముందే రూ. 1000 కోట్ల ఆఫర్ వచ్చిందట. కాగా నెక్స్ట్ త్రివిక్రమ్ మూవీకి అల్లు అర్జున్ సైన్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. అట్లీతో చర్చలు జరుగుతున్నాయని వినికిడి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version