https://oktelugu.com/

Vikramarkudu 2: విక్రమార్కుడు 2 సినిమాలో రవితేజ హీరోగా చేయడం లేదా..? మరి ఎవరు చేస్తున్నారు..?

Vikramarkudu 2: విక్రమార్కుడు 2 సినిమా రాబోతుంది అంటూ ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) కొద్దిరోజుల క్రితం ఒక హిట్ అయితే ఇచ్చాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 3, 2024 / 03:39 PM IST

    Who is playing the hero in Vikramarkudu 2

    Follow us on

    Vikramarkudu 2: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాలో రవితేజ అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ లో నవ్వులు పూయిస్తూనే, విక్రమ్ సింగ్ రాథోడ్ లాంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో చూపిస్తూ ప్రేక్షకులందరి చేత విజిల్స్ వేయించాడు. అయితే ఈ సినిమా తెలుగులో సూపర్ సక్సెస్ అయింది.

    ఈ సినిమాను దాదాపు ఆరు భాషల్లో రీమేక్ చేస్తే అన్ని భాషల్లో కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం…ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా విక్రమార్కుడు 2 సినిమా రాబోతుంది అంటూ ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్రప్రసాద్(Vijayendra Prasad) కొద్దిరోజుల క్రితం ఒక హిట్ అయితే ఇచ్చాడు. అయితే ఈ సినిమాను కే కే రాధమోహన్ నిర్మించబోతున్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంపత్ నంది డైరెక్టర్ గా వ్యవహరించబోతున్నాడు అంటూ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు విక్రమార్కుడు 2 సినిమాలో రవితేజ హీరోగా చేయడం లేదనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ హీరో ప్లేసులో ఈ సినిమాని చేసే దమ్మున్న హీరో ఎవరున్నారు అంటూ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Also Read: OG Movie: ఓజీ రిలీజ్ మీద ఆందోళన పడుతున్న పవన్ అభిమానులు…

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి దర్శకుడిగా సంపత్ నంది వ్యవహరించినప్పటికీ ఈ సినిమాకి హీరోగా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇది తెలుసుకున్న రవితేజ అభిమానులు రవితేజ లాంటి యాక్టింగ్ ని విజయ్ దేవరకొండ చేయగలడా, విక్రమార్కుడు మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడానికి రవితేజ చేసిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎంత కీలకపాత్ర వహించిందో అలాగే అత్తిలి సత్తిబాబు పండించిన కామెడీ కూడా చాలా హెల్ప్ అయింది.

    Also Read: Heroine: 9 ఏళ్లలో ఒక్క హిట్ లేదు, అయినా సినిమాకు రూ. 40 కోట్లు, ఇండస్ట్రీ వెలివేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    కాబట్టి విజయ్ దేవరకొండ రవితేజ లాగా కామెడీని పండించగలడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రొడ్యూసర్ రాధా మోహన్ ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తే తప్ప ఈ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు. చూడాలి మరి ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేది…