https://oktelugu.com/

Director Teja: ఫస్ట్ టైమ్ స్టార్ హీరో ను డైరెక్షన్ చేయనున్న తేజ…

Director Teja: లవ్ స్టోరీలను తీయడంలో తేజను మించిన వారు మరొకరు లేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో తేజ విమర్శకుల నుంచి ప్రశంసలనైతే అందుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 3, 2024 / 03:45 PM IST

    Teja to direct star hero

    Follow us on

    Director Teja: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లకి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్లలో దర్శకుడు తేజ ఒకరు…ఈయన చిత్రం, నువ్వు నేను, జయం లాంటి మూడు వరుస బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక లవ్ స్టోరీలను తీయడంలో తేజను మించిన వారు మరొకరు లేరు అనేంతలా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో తేజ విమర్శకుల నుంచి ప్రశంసలనైతే అందుకున్నాడు.

    కానీ సక్సెస్ లను మాత్రం అందుకోలేకపోయాడు.ఇక దాంతో వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు రిజల్ట్ మాత్రం ఆశించిన మేరకు రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే 2018లో ఆయన చేసిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంటే ఇప్పుడు మరోసారి ఆయన్ని హీరోగా పెట్టి “రాక్షస రాజా”(Rakshasa Raja) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత తేజ, విక్టరీ వెంకటేష్(Venkatesh) ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

    Also Read: OG Movie: ఓజీ రిలీజ్ మీద ఆందోళన పడుతున్న పవన్ అభిమానులు…

    ఇక ఇప్పటికే వెంకటేష్ ని కలిసి ఆయనకు ఒక కథను కూడా చెప్తాడట. దాంతో వెంకటేష్ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే ఒక సినిమా అనౌన్స్ చేసినప్పటికి అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం వెంకటేష్ తో తప్పకుండా సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే తేజ ఒక సూపర్ స్క్రిప్ట్ ని వెంకటేష్ కి నరేట్ చేశారట.

    Also Read: Heroine: 9 ఏళ్లలో ఒక్క హిట్ లేదు, అయినా సినిమాకు రూ. 40 కోట్లు, ఇండస్ట్రీ వెలివేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    దాంతో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం ఖాయం అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్లఅభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఇక మొత్తానికైతే తేజ వెంకటేష్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చాలామంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…