OG Movie: ఓజీ రిలీజ్ మీద ఆందోళన పడుతున్న పవన్ అభిమానులు…

OG Movie: మొత్తానికైతే పవన్ కళ్యాణ్ జులై 10వ తేదీ నుంచి షూటింగుల్లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఓజీ సినిమా షూటింగ్ అనుకున్న డేట్ కి పూర్తయిపోయి అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా...

Written By: Gopi, Updated On : June 3, 2024 2:35 pm

Pawan Kalyan fans are worried about OG Movie release

Follow us on

OG Movie: ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ అంచనాలు ఉన్న సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజి ‘ సినిమా ఒకటి. అయితే ఈ సినిమాకి సుజీత్(Sujeeth) డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇప్పటికే సాహో సినిమాతో బాలీవుడ్ లో ఒక భారీ సక్సెస్ అయితే అందుకున్నాడు. కాబట్టి అక్కడ ఆయనకు మంచి మార్కెట్ అయితే ఉంది.

ఇంక దాంతో పవన్ కళ్యాణ్(Kalyan) తో చేయబోయే ఓజి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని ప్రొడ్యూసర్ డివివి దానయ్య(DVV Danayya) అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. అయినప్పటికీ మధ్యలో ఎలక్షన్స్ రావడం కారణంగా ఈ సినిమా అనుకున్న డేట్ కైతే వచ్చే విధంగా కనిపించడం లేదు. దానివల్లే అభిమానులు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఎలక్షన్స్ కు సంబంధించిన రిజల్ట్ రానున్న నేపధ్యం లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

Also Read: Star Heroine: ప్రభాస్ తో నటించాలంటే ఆయన నా ఇంటికి… స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

ఇక ఈ గెలుపుని ఎంజాయ్ చేస్తూ మరొక నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకి హాజరు కాలేడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ జులై 10వ తేదీ నుంచి షూటింగుల్లో పాల్గొనబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఓజీ సినిమా షూటింగ్ అనుకున్న డేట్ కి పూర్తయిపోయి అనుకున్న సమయానికి థియేటర్లలోకి వస్తుందా అంటే మాత్రం సినిమా మేకర్స్ లో చాలావరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Bharateeyudu 2: భారతీయుడు 2 లో కమలహాసన్ సిద్ధార్థ్ ఇద్దరిలో హీరో ఎవరు..?

మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం అహర్నిశలు డే అండ్ నైట్ కష్టపడి సినిమాని కంప్లీట్ చేసి అనుకున్న డేట్ కి తీసుకొస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయం లో ఏం జరిగిన కూడా అది పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది అనేది మాత్రం వాస్తవం…