Who is Arjun Das: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. చాలామంది చాలా సంవత్సరాల పాటు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ చాలా వరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ నటుడు అయిన అర్జున్ దాస్ (Arjun Das) సైతం ప్రస్తుతం విలన్ పాత్రలను పోషిస్తూ తన గాత్రంతో ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు… నిజానికి అర్జున్ దాస్ సినిమాల్లోకి రావడానికి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు…చిన్నప్పుడు తన స్కూల్లో డిబేట్లో పాల్గొన్నప్పుడు తన వాయిస్ బాగుందంటూ చాలామంది అవార్డులను కూడా ఇచ్చారట. చదువు అయిపోయిన తర్వాత దుబాయ్ లో జాబ్ చేస్తున్న క్రమంలో ఆయన సినిమాల్లోకి రావాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు తను ఓవర్ వెయిట్ ఉండడం వల్ల వెయిట్ తగ్గించి ఫిట్ అవ్వాలని అనుకొని జిమ్ లో జైన్ అయి దాదాపు 40 కేజీల వరకు బరువు అయితే తగ్గాడు…దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చి రేడియో జాకీగా చాలా మంచి పాపులారిటి సంపాదించుకున్నాడు. ఇక ఆడిషన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలామంది తన వాయిస్ ఏదో రకంగా ఉందని సినిమాలకు సెట్ అవ్వదు అంటూ చాలా హేళన చేస్తూ మాట్లాడేవారట. అయినప్పటికి తను ఎక్కడ తగ్గకుండా సినిమా మీద ఇంట్రెస్ట్ తో అవకాశాల కోసం తిరిగినప్పుడు ‘పేరుమాన్’ (Peruman) అనే సినిమాలో అతనికి నటుడిగా అవకాశమైతే వచ్చింది. అప్పటినుంచి చిన్నచితక పాత్రలు చేస్తూ వస్తున్నప్పటికి లోకేష్ కనకరాజు డైరెక్షన్లో వచ్చిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also Read: ఇండస్ట్రీ లో స్టార్ హీరో అవ్వాలంటే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉండాల్సిందేనా..?
ఇక తన బేస్ వాయిస్ చూసిన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిపోయిందనే చెప్పాలి… అందులో భాగంగా మన స్టార్ హీరోలు సైతం ఆయన చేతనీ డబ్బింగ్ చెప్పిస్తున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898’ లో కృష్ణుడి పాత్రకి డబ్బింగ్ చెప్పి ఆ పాత్రను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు…
ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ (OG) సినిమాలో సైతం పవన్ కళ్యాణ్ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి సినిమా లెవెల్ ని మార్చేశాడు… ఇక ముఫాసా సినిమా తమిళ్ వర్షన్ కి తనే డబ్బింగ్ చెప్పడం విశేషం… ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో విలన్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
ఇక అజిత్ హీరోగా వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) సినిమాలో విలన్ గా నటిస్తూనే అందులో ద్విపాత్రాభినయం చేసి ఒక పాటలో డాన్స్ కూడా చేశాడు…ఒకప్పుడు ఆయన వాయిస్ బాలేదని చెప్పిన వారే ఇప్పుడు తమ సినిమాల్లో అర్జున్ దాస్ కావాలని కోరుకుంటుండటం విశేషం…