Avatar 3: అవతార్ 3 సినిమాను పట్టలెక్కించబోతున్న జెమ్స్ కెమెరూన్.. రిలీజ్ ఎప్పుడంటే..?

అవతార్ 3 కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక తను అవతార్ 3 సినిమాని ఎలాగైనా సరే పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 1, 2024 4:01 pm

Avatar 3 Latest updates

Follow us on

Avatar 3: హాలీవుడ్ లో భారీ సినిమాలను తీసి భారీ సక్సెస్ లను కొట్టి చూపించడంలో జేమ్స్ కెమెరూన్ గారిది అందేవేసిన చెయ్యి…ఇక ఇప్పటివరకు ఈయన చేసిన ప్రతి సినిమా కూడా అన్ని దేశాల్లో మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నాయి. ఇక ఈయన సినిమాలు తీయడానికి చాలా సమయాన్ని తీసుకున్నప్పటికీ ఆ సినిమాల మీద పెట్టుబడి మొత్తాన్ని రాబట్టడంలో తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి.

ఇక ఈయన డైరెక్షన్ లో వచ్చిన టైటానిక్, అవతార్, అవతార్ 2 లాంటి సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు సాధిస్తూ ముందుకు కదులుతున్నాయి. మరి ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఈయన అవతార్ 3 కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక తను అవతార్ 3 సినిమాని ఎలాగైనా సరే పట్టాలెక్కించే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని ఈ ఇయ్యర్ ఎండింగ్ లో సెట్స్ మీదకి తీసుకెళ్లి 2030 కల్లా ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాతో మరోసారి భారీ కలెక్షన్లు కొల్లగొడటమే లక్ష్యంగా కెమెరూన్ ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం హై టెక్నాలజీ ని వాడుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు చేసిన అవతార్, అవతార్ 2 ఈ రెండు సినిమాలకు ఎలాంటి టెక్నాలజీ అయితే వాడాడో ఇప్పుడు అంతకు మించి మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడి సినిమాను సక్సెస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు కదులుతున్నాడు.

ఇక ఇప్పుడు హాలీవుడ్ సినిమా స్టాండర్డ్ ని అందుకోవడానికి చాలా దేశాల సినిమాలు పోటీ పడుతున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ షాకిస్తూ జేమ్స్ కెమెరూన్ మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. కొత్త టెక్నాలజీతో సినిమాలు చేయడంలో తను ఎప్పుడు ముందుంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా అదే తరహాలో ముందుకు కదులుతున్నట్టుగా తెలుస్తుంది…