https://oktelugu.com/

Cheated: మీరు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

గుడ్డిగా ఒకరిని నమ్మడమే ముందుగా మీ వినాశనానికి దారి తీస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా చెప్పినా, దేని గురించైనా వివరించినా కూడా వారు చెప్పే విధానం వారి పలకరింపు స్వీట్ గా ఉందని మీరు నమ్మేస్తారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 1, 2024 / 04:00 PM IST

    Cheated

    Follow us on

    Cheated: నమ్మకం అనేది ప్రస్తుతం చాలా పెద్ద పదంగా కనిపిస్తుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. మీతో ఉంటే మిమ్మల్ని నమ్మిస్తూ మీ గురించే చెడుగా మాట్లాడే వారు ఎక్కువగా ఉంటున్నారు. పక్కలో బళ్లాల మాదిరి మీ చుట్టూ ఇలాంటి వారు ఉంటారు. కానీ గుర్తించడం కష్టమే. ఆలస్యంగా గుర్తించినా అప్పటికీ జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అయితే మీరు మోస పోయారా? దీని వల్ల బాధ పడుతున్నారా? కానీ మోస పోవడానికి ప్రధాన కారణం ఏంటి?అని ఎప్పుడైనా ఆలోచించారా?

    గుడ్డిగా ఒకరిని నమ్మడమే ముందుగా మీ వినాశనానికి దారి తీస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా చెప్పినా, దేని గురించైనా వివరించినా కూడా వారు చెప్పే విధానం వారి పలకరింపు స్వీట్ గా ఉందని మీరు నమ్మేస్తారు. అంతే అప్పుడే మీరు మోస పోవడం మొదలవుతుంది. తీరా మోసపోయారని తెలిసాక బాధ పడుతారు. కొందరు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎవరిని మోసం చేయలేదు. కానీ నన్ను అందరూ మోసం చేస్తున్నారని బాధ పడుతుంటారు. కానీ మీరు పోసపోవడానికి ప్రధాన కారణం మీరే.

    నమ్మాలి అనిపించకపోయినా ఈ కాలంలో ధర్మం, నీతి అనే వాటికి చోటు చాలా తక్కువ ఉంది అంటున్నారు పెద్దలు. ఈ మధ్య పూజలు, పునస్కారాలు చేసే వారు పెరిగారు. ప్రవచనాలు వినడానికి వెళ్లేవారి సంఖ్య పెరిగింది. కానీ ధర్మంగా ఉండే వారి సంఖ్య మాత్రం రోజురోజుకు తగ్గుతుంది. అందుకే లోకంలో ఎవరిని నమ్మకూడదు అంటారు. ఒక మనిషిని పూర్తిగా నమ్మకూడదు అంటారు నిపుణులు. వారి మీద నమ్మకం ఉన్న మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. లేదంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు అవుతుంది.