ప్రభాస్ మంచి భోజన ప్రియుడు. తినడంలోనే కాదు తినిపించడంలోనూ ప్రభాస్ లో ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ప్రభాస్ తన కో నటీనటులకు స్పెషల్ ఫుడ్ పార్టీలు ఇస్తుంటాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కు ఒక స్సెషల్ బిర్యానీ పంపించాడు. అయితే ఈ బిర్యానీ పై బాలీవుడ్ ముదురు బ్యూటీ, సైఫ్ సతీమణి కరీనా కపూర్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫొటో పోస్ట్ చేసింది.

పైగా ఆ ఫోటోకి ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ మెసేజ్ ఏమిటంటే.. ‘బాహుబలి బిర్యానీ పంపించాడంటే.. కచ్చితంగా అది బెస్ట్ అయి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి సూపర్ ఫుడ్ పంపినందుకు’ అంటూ కరీనా కామెంట్ పెట్టింది. అలాగే ప్రభాస్ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ మరీ తినేసిందట. ఈ విషయాన్ని కూడా తన ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంది కరీనా.
కరీనా కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ “ఏ- ఆది పురుష్” సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా శ్రీరాముడిగా నటిస్తోన్నాడు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా షూట్ సమయంలోనే ప్రభాస్ కి సైఫ్ అలీ ఖాన్ కి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరు ఒకరికి ఒకరు ప్రత్యేక గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకుంటున్నారు.
కాగా ఈ సినిమాలో సీతగా కృతి సనోన్ నటిస్తోంది. బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ రౌత్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అందుకే ఈ సినిమా కోసం యావత్తు భారత దేశం ఎదురుచూసేలా చేస్తోంది. ఆదికావ్యం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ప్రభాస్ తో చేయడం నిజంగా విశేషమే.
ప్రభాస్ కూడా తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. అందుకే ఈ మధ్య ఎక్కువగా బాలీవుడ్ స్టార్లతో ప్రభాస్ ప్రత్యేక అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు.