స్టార్ కమెడియన్ అలీ దాదాపుగా 4 దశాబ్దాలుగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎన్నో విజయాలను అందుకున్నారు. కొన్ని సినిమాల్లో అలీ హీరోగా నటించినప్పటికీ కమెడియన్ పాత్రలకు మాత్రం దూరం కాలేదు. ప్రస్తుతం అలీ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు హొస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా అలీ భార్య జుబేదా హోం టూర్ వీడియోను షేర్ చేసి తమ ఇంటికి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు.

ఈ వీడియోలో అలీ తనకు వచ్చిన రివార్డులు, అవార్డుల గురించి స్వయంగా వెల్లడించారు. హాల్, నమాజ్ ఏరియా, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇతర సౌకర్యాలతో ఇంద్ర భవనంను తలపించే విధంగా అలీ ఇల్లు ఉండటం గమనార్హం. మూడంతస్థుల భవనంలో అలీ నివశిస్తుండగా విలాసవంతమైన గదులను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలీ భార్య జుబేదా తన శారీ కలెక్షన్ తో పాటు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న హోమ్ థియేటర్ ను సైతం చూపించారు.
అలీ ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ వీడియోకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం. అలీ ఇండస్ట్రీలో తన ప్రతిభకు వచ్చిన అవార్డులను ఇంట్లో అందంగా అలంకరించుకున్నారు. అలీ తన ఇంటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని హోమ్ టూర్ వీడియోను చూస్తే అర్థమవుతోంది. అలీకి సినిమా ఆఫర్లు తగ్గినా పూరీ జగన్నాథ్ సినిమాల్లో మాత్రం ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి.
ఒక్కో సినిమాకు అలీ పారితోషికం 2 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. సినిమాల ద్వారా బాగానే సంపాదించిన అలీ సేవా కార్యక్రమాలు చేస్తూ గొప్ప మనస్సును చాటుకుంటున్నారు.