Dil Raju-Sriram Venu Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో చాలా మంది హీరోలు పాన్ ఇండియా ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాయలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దర్శకులు సైతం భారీ సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీరామ్ వేణు లాంటి మీడియం రేంజ్ దర్శకుడు చేస్తున్న సినిమాలు కూడా ఆయనకు ఎలాంటి గుర్తింపును ఇవ్వడం లేదు…వరుసగా దిల్ రాజుతోనే ఆయన సినిమాలు చేస్తున్నాడు. మరి ఆయన బయటికి వెళ్లి సినిమాను చేసే అంత కెపాసిటి లేదా లేదంటే కావాలనే దిల్ రాజే తనను వదులుకోవడం లేదా అనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి వీళ్ళు ఇద్దరు స్టార్టింగ్ నుంచి మంచి ఫ్రెండ్స్ అయినప్పటికి కూడా వీళ్లు చేసిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ ని సాధించిన దాఖలాలు అయితే లేవు. కేవలం యావరేజ్ లుగా మాత్రమే మిగులుతున్నాయి… రీసెంట్ గా ఆయన చేసిన తమ్ముడు (Thammudu) సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవడంతో ఆయన చాలావరకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. కేవలం 75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 10 కోట్లు కూడా వసూలు చేయకుండా దాదాపు 65 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చినట్టుగా తెలుస్తోంది.
మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇప్పటికైనా దిల్ రాజు శ్రీరామ్ వేణు ను వదిలేస్తాడా? లేదా అనే విషయాల మీద చాలా కీలకమైన చేర్చలైతే జరుగుతున్నాయి.
Also Read: వాళ్లకు పిచ్చెక్కిస్తున్న డార్లింగ్ ప్రభాస్..! ఆయనకే క్లారిటీ లేదా?
ముఖ్యంగా శ్రీరామ్ వేణు చేసే సినిమాల్లో కథ ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండదు. ఆయన ఎమోషన్స్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటూ కథనైతే రాసుకోడు. దానివల్లే ఆయన సినిమాలు డిజాస్టర్లుగా మారుతున్నాయి. లేదంటే యావరేజ్ గా మిగులుతున్నాయి తప్ప భారీ సక్సెస్ లను అయితే సాధించలేకపోతున్నాయి…
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన నాలుగు సినిమాల్లో నాలుగు సినిమాలు పెద్ద గొప్ప సక్సెసులనైతే సాధించినవి ఏమీ లేవు. కాబట్టి ఇకమీదటైనా ఆయన సినిమాలు చేయకుండా కామ్ గా ఉంటే సరిపోతుంది. లేకపోతే ఒక మంచి కథను తీసుకొని బాగా రాసుకొని సూపర్ సక్సెస్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కొంతమంది విమర్శకులు సైతం అతనికి సలహాలు ఇస్తుండటం విశేషం…