The Paradise Movie: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా ఆగస్టు 21వ తేదీన రిలీజ్ అవ్వబోతుందంటూ అనౌన్స్ చేశారు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు. కాబట్టి ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే సినిమా యూనిట్ నుంచి ఇంకా అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడానికి సినిమా యూనిట్ తొందరలోనే ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…నాని ఇప్పటికే డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో భారీ ఇమేజ్ ను క్రియేట్ చేసుకోగలుగుతున్నాడు.
టైర్ వన్ హీరోల లిస్టులో చేరడానికి నాని విపరీతమైన సన్నాహాలైతే చేస్తున్నాడు. అతను అనుకున్నట్టుగానే యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరికి పోటీని ఇచ్చే కెపాసిటి తనకు ఉందా హీరోలు ఎంతమంది వచ్చినా కూడా ఆ పోటీని తట్టుకోగలుగుతాడా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకొచ్చినప్పటికి టైర్ వన్ హీరోల లిస్టులో మాత్రం చేర్చలేకపోతున్నాయి. కారణం ఏంటంటే ఆయన సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడం లేదు. సినిమాకి 200 కోట్లకు పైన బడ్జెట్ కేటాయించారు. తన కెరియర్ లోనే ఇది అత్యంత హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా నిలుస్తుంది. ఈ బడ్జెట్ రికవరీ అవుతుందా? లేదా అనే ధోరణిలోనే మరికొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
ఇక దిల్ రాజు ఈ సినిమాని 110 కోట్లకు కొనుగోలు చేయడానికి డీల్ కుదుర్చుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని అమ్మే ఉద్దేశం లేదట. వాళ్లే ఓన్ రిలీజ్ చేసుకుంటారా? లేదంటే ఇతర డిస్ట్రిబ్యూటర్ లకు ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది…
