YSR memorial in Hyderabad: కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) ఎంతోమంది నాయకులు ఉన్నారు. కానీ ప్రజలను ప్రభావితం చేసింది కొందరే. అటువంటి నేతల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండగా నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలాన్ని ఇచ్చారు. అయితే అటువంటి నేతకు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో స్మరించేందుకు సరైన వేదిక లేదు. ఎన్టీఆర్ కు హైదరాబాదులో ఎన్టీఆర్ ఘాట్ ఉంది. కానీ రాజశేఖర్ రెడ్డి కి అటువంటిది లేదు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో ముఖ్యమంత్రి అయ్యారు. హైదరాబాదులో తన సన్నిహితుడైన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. కానీ ఎన్నడు వైయస్ రాజశేఖర్ రెడ్డి స్మారకార్థం ఒక ఘాట్ కానీ.. స్మారక వేదిక కానీ నిర్మించాలన్న ఆలోచన చేయలేదు. ఇప్పుడు దానిపై దృష్టి పెట్టారు షర్మిల.
#WATCH | Idupulaya, Andhra Pradesh | APCC Chief YS Sharmila Reddy offers floral tributes to Dr YS Rajashekhar Reddy on the occasion of his 76 birth anniversary
(Source: YS Sharmila team) pic.twitter.com/4Wt6yQYe1C
— ANI (@ANI) July 8, 2025
కాంగ్రెస్ హై కమాండ్ కు లేఖలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల( Y S Sharmila ) రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికే లేఖలు రాశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్య విజ్ఞప్తి చేశారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎంతో చేశారని.. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారని.. అటువంటి వ్యక్తి జయంతి, వర్ధంతిలనాడు స్మరించుకునేందుకు వీలుగా హైదరాబాదులో స్మారక వేదిక ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. తద్వారా కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి చేయలేనిది.. ఇప్పుడు కుమార్తె షర్మిల చేశారని కుటుంబ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
అప్పట్లో అవకాశం ఉన్నా..
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కెసిఆర్ తో( KCR) మంచి సంబంధాలే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 2018 ఎన్నికల సమయంలో మాత్రం పోటీ చేయలేదు. పరోక్ష సహకారం కేసీఆర్ కు అందించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే 2019లో అదే కెసిఆర్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. ఈ ఇద్దరు రాజకీయంగా ఒకరినొకరు సహకరించుకున్నారు. ఆ సమయంలో నేడు షర్మిల పెట్టిన ప్రతిపాదన పెట్టి ఉంటే కచ్చితంగా కెసిఆర్ స్పందించేవారు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. ఇప్పుడు సోదరుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విభేదిస్తున్న షర్మిల.. తండ్రి స్మారకార్థం ఒక వేదిక ఏర్పాటు చేయాలని కోరడం మాత్రం.. నిజంగా ఆమెకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే అంశమే. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి విమర్శలకు గురికాక తప్పదు.
రేవంతన్న… వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మెమోరియల్ హైదరాబాద్ లో నిర్మించాల్సి ఉంది. గతంలోనే నిర్ణయం జరిగినా పెండింగ్ పెట్టారు. దాన్ని పూర్తి చేసేలా చొరవ తీసుకోండి.#Sharmila #RevanthReddy pic.twitter.com/cZDXQ6OCgz
— Telugu360 (@Telugu360) July 8, 2025