Akhil Akkineni: నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. మొదటి సినిమానే వినాయక్ లాంటి భారీ డైరెక్టర్ తో చేసి హిట్టు కొట్టాలని, అలా హిట్ సినిమాతోనే తన కొడుకుని లాంచ్ చేయాలని నాగార్జున అనుకున్నాడు. కానీ అఖిల్ సినిమా స్టోరీ అనేది పెద్ద స్టోరీ అవ్వడం మూలన అది అతనికి సెట్ అవ్వలేదు..ఇక ఇలాంటి కథ మనోడికి సెట్ అవుతుందా లేదా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా నాగార్జున అఖిల్ లాంటి ఒక పెద్ద స్కేల్ ఉన్న సినిమాని అఖిల్ కి మొదటి సినిమా కోసం ఎంచుకోవడం ఆయన చేసిన మొదటి తప్పు…ఇక ఈ సినిమాని వినాయక్ తన రేంజ్ లో తెరకెక్కించలేదు అనుకోండి అది వేరే విషయం దాంతో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది…
దానితో నాగార్జున కొంతవరకు రియలైజ్ అయి విక్రమ్ కె కుమార్ తో హలో అనే సినిమా చేయించాడు దీంతో రీ లాంచ్ చేయించాడు. ఇక హలో సినిమా మేకింగ్ పరంగా బాగున్నప్పటికీ కథ మాత్రం పాత చింతకాయ పచ్చడి కావడం తో దానివల్లే అఖిల్ కి మరో డిజాస్టర్ అనేది అతని ఖాతాలో పడింది…
ఇక రెండు సార్లు అయిపోయిన తర్వాత మూడోసారి డైరెక్టర్ వెంకీ అట్లురి డైరెక్షన్ లో మిస్టర్ మజ్ను అనే సినిమా చేశాడు. ఈ సినిమా అయితే ఇంతకు ముందు రెండు సినిమాల కంటే దారుణమైన డిజాస్టర్ ని అందుకుంది. ఇలా అఖిల్ కెరియర్ లో ఏ సినిమా చేసినా కూడా డిజాస్టర్ అవ్వడానికి పోటీ పడుతున్నాయి తప్ప సక్సెస్ కొట్టే ప్రయత్నం అయితే చేయడం లేదు. అందుకే అఖిల్ కెరీయర్ లో ఇప్పటివరకు చేసినా ఏ ఒక్క సినిమా కూడా పెద్ద గా సక్సెస్ సాధించలేదు. ఇక దాంతో బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ అది కుడ్ పెద్ద హిట్ అయితే కాదు మిగిలిన సినిమాలతో పోలిస్తే జస్ట్ పర్లేదు అని చెప్పవచ్చు. ఇక ఎన్నో అంచనాలతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా కూడా ఒక భారీ డిజాస్టర్ ని అందుకుంది. ఇలా అఖిల్ చేస్తున్న ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతుండడంతో అటు అక్కినేని అభిమానులు కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాగార్జున తన కొడుకుల లైఫ్ ని సెటిల్ చేయడంలో ఏమాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు అంటూ చాలామంది సినీ విమర్శకులు సైతం నాగార్జున ని విమర్శిస్తున్నారు…
అఖిల్ సినీ కెరియర్ లో నాగార్జున చేసిన తప్పేంటి అంటే మనం అనే సినిమా ద్వారా అఖిల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆయన క్లైమాక్స్ లో కనిపించేది ఒక ఐదు నిమిషాలు అయిన కూడా ఆ సినిమా క్రెడిట్ మొత్తం తనే లాగేసుకున్నాడు. ఇక అలాంటి భారీ అంచనాలతో తను హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ తో ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేది. అలా కాకుండా లేనిపోని హంగులకు పోయి వినాయక్ లాంటి భారీ డైరెక్టర్ ను పెట్టుకొని ఒక భారీ డిజాస్టర్ సినిమా తీసి ప్రేక్షకుల మొఖానికి కొట్టి నా కొడుకుని ఆదరించండి అంటే ఎవరు మాత్రం ఎందుకు ఆదరిస్తారు అందుకే ప్రేక్షకులు కూడా ప్రతి సారి అఖిల్ ని రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు… ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ కి హిట్ ఇచ్చే డైరెక్టర్ ఎవరు అనేది అర్థం కాక నాగార్జున తల పట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: What is the reason why akhil is not successful as a hero
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com