https://oktelugu.com/

Satyabhama: సత్యభామ ట్విట్టర్ టాక్: పోలీస్ రోల్ లో కాజల్ విధ్వసం, ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే?

సత్యభామ కథ విషయానికి వస్తే... కాజల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆమె షీ టీమ్ లో పని చేస్తుంది. అమ్మాయిలకు అన్యాయం జరిగితే అసలు సహించదు. అమ్మాయిలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సాంకేతికతను ఎలా వాడుకోవాలో అవగాహన కలిపిస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 7, 2024 8:42 am
    Satyabhama

    Satyabhama

    Follow us on

    Satyabhama: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సత్యభామ. ఆమె ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసింది. జూన్ 7న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా టాక్ బయటకు వస్తుంది. మరి సత్యభామ సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దాం. సత్యభామ చిత్రానికి సుమన్ చిక్కాల దర్శకుడు. శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు సమర్పకుడిగా ఉన్నాడు. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు ఇతర కీలక రోల్స్ చేశారు.

    సత్యభామ కథ విషయానికి వస్తే… కాజల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఆమె షీ టీమ్ లో పని చేస్తుంది. అమ్మాయిలకు అన్యాయం జరిగితే అసలు సహించదు. అమ్మాయిలు తమను తాము ఎలా రక్షించుకోవాలి, సాంకేతికతను ఎలా వాడుకోవాలో అవగాహన కలిపిస్తుంది. ఈ క్రమంలో హసీనా అనే అమ్మాయి భర్త యాదు చేతిలో చిత్ర హింసలకు గురవుతూ ఉంటుంది. భర్తపై కాజల్ కి హసీనా ఫిర్యాదు చేస్తుంది. యాదుకు కాజల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది.

    దాంతో ఆగ్రహానికి గురైన యాదు భార్య హసీనాను చంపేస్తాడు. అతన్ని పట్టుకునే క్రమంలో కాజల్ ఫైరింగ్ చేస్తుంది. ఈ కారణంగా సస్పెండ్ అవుతుంది. యాదు కోసం ఆమె వెతుకులాట మాత్రం ఆగదు. హసీనా తమ్ముడు ఇక్బాల్ బాధ్యత కాజల్ తీసుకుంటుంది. సడన్ గా ఇక్బాల్ కనిపించకుండా పోతాడు. మరి యాదు దొరికాడా? ఇక్బాల్ ఏమయ్యాడు? అతడి నేపథ్యం ఏమిటీ? అనేది సత్యభామ మిగతా కథ.

    కెరీర్ బిగినింగ్ నుండి కాజల్ ఎక్కువగా గ్లామరస్ రోల్స్ చేసింది. ఆమెకు అదే ఇమేజ్ ఉంది. కాజల్ ఇమేజ్ కి భిన్నమైన చిత్రం సత్యభామ. ఆమె అవుట్ అండ్ అవుట్ క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఒక సీరియస్ పోలీస్ అధికారిణి పాత్రలో ఆమె మెప్పించగలదా అనే సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను పటాపంచలు చేసింది. కాజల్ తన పాత్రలో అద్భుతంగా నటించింది. ఎమోషన్స్ కూడా ఓ రేంజ్ లో పండించింది. మొదటిసారి యాక్షన్ ఎపిసోడ్స్ లో దుమ్మురేపింది. కాజల్ అన్నీ తానై ఈ చిత్రాన్ని నడిపించే ప్రయత్నం చేసింది.

    ఇక కథ కథనాల విషయానికి వస్తే… అలరించే ట్విస్టులు, ఊహించని మలుపులు సినిమాలో ఉన్నాయి. కథ పరంగా పర్లేదు. స్క్రీన్ ప్లే కొంత మేర మెప్పిస్తుంది. శ్రీ చరణ్ పాకాల బీజీఎమ్ సైతం ఆకట్టుకుంది. కథలో సబ్ క్యారెక్టర్స్ ఎక్కువైపోయాయి. ఇది ఒకింత కన్ఫ్యూజ్ చేస్తుంది. మొత్తంగా కాజల్ ఫ్యాన్స్ సినిమాను ఆస్వాదిస్తారు. వీకెండ్ ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు.