Vishnu Vinyasam 5 Days Worldwide Collections: శ్రీ విష్ణు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విష్ణు విన్యాసం’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని ముందుకు దూసుకుపోతోంది. ఫిబ్రవరి నెలలో విడుదలైన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గానే నిల్చింది. బయ్యర్స్ తీవ్రమైన నిరాశకు గురయ్యారు, థియేటర్స్ ని ఒక్కొక్కటిగా మూసివేయడం మొదలు పెట్టారు. అలాంటి సమయం లో విడుదలైన ‘విష్ణు విన్యాసం’ చిత్రం మంచి వసూళ్లను ఓపెనింగ్స్ ని సాధించుకుంది. వీకెండ్ వరకు కూడా నాన్ స్టాప్ హౌస్ ఫుల్స్ తో నడిచిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ని కనబరుస్తూ బ్రేక్ ఈవెన్ మార్కుకి చేరువ అవుతోంది. 8.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజుల్లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read: అక్షరాలా 250 కోట్లు..విడాకుల వ్యవహారం లో తమిళ హీరో విజయ్ తెలివైన ఎత్తుగడ!
ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే, నైజాం ప్రాంతం నుండి 2.40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 1.66 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 4.06 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ నుండి 1.74 కోట్ల రూపాయిలు రాబట్టింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 5.80 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 11.90 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కేవలం 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ లో ఈ చిత్రం డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసినా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలగలదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
5 వ రోజున ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 10 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. వీకెండ్ మొదలయ్యే లోపే ఈ చిత్రం 7 కోట్ల షేర్ మార్కుకి చాలా దగ్గరగా చేరుతుందని, ఆ తర్వాత వీకెండ్ కి పూర్తి స్థాయి లో రీకవరీ ని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుంది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.