https://oktelugu.com/

Kanguva: రోజు రోజుకి అంచనాలు పెంచుతున్న కంగువ మూవీ…రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

సిచువేశన్ ను బట్టి చూస్తే అన్ని సినిమాలు కూడా తమ తమ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసుకొని ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : June 7, 2024 / 08:07 AM IST

    Kanguva

    Follow us on

    Kanguva: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు సూర్య.. అయితే సూర్య శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో కంగువ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా రోజులవుతున్నప్పటికీ గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు లేటవ్వడం వల్ల సినిమా రిలీజ్ లేట్ అవుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక ఇప్పుడున్న సిచువేశన్ ను బట్టి చూస్తే అన్ని సినిమాలు కూడా తమ తమ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసుకొని ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి ఒక్క విషయం కూడా సినిమా మీద మంచి అంచనాలనైతే పెంచుతూ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా పదివేల మందితో ఒక వార్ ఎపిసోడ్ ని షూట్ చేసినట్టుగా ఈ సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది.

    ఇక దాంతో ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలైతే భారీ స్థాయిలో పెరిగిపోయాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కూడా సూర్య, బాబీ డియోల్ మధ్య ఒక పది నిమిషాల పాటు ఫైట్ ఉండనట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక దాంతో మరోసారి ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఇక మొత్తానికైతే ఈ మూవీ తో సూర్య భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ శివ కూడా ఇప్పటివరకు అన్నీ కమర్షియల్ సినిమాలు మాత్రమే చేశాడు.

    ఇక ఇప్పుడు తను గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ తో డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేస్తున్నాడు. ఇక దాంతో తను సూపర్ సక్సెస్ అవుతాడని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. ఇక మొత్తానికైతే సూర్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించి అంతకు మించిన వసూళ్లను రాబట్టాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో సూర్య ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…