CM Revanth Reddy: కోడ్‌ ముగిసింది.. పని మొదలెట్టండి!

మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలకు ఈ కోడ్‌ బ్రేక్‌ వేసింది. మడు నెలలు అత్యవసరమైన అంశాలపై మాత్రమే చర్చించారు.

Written By: Raj Shekar, Updated On : June 7, 2024 10:06 am

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: మూడు నెలలుగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా ఆగింది. నేతలు కూడా పాలనపై దృష్టి పెట్టలేదు. జూన్‌ 6తో ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఈమేరకు ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ఇక పాలనపై దృష్టి పెట్టనున్నారు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా హామీలు నెరవేర్చలేదని ఇప్పటికే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాధాన్యత అంశాలను ముందుగా గుర్తించి వాటిపై చర్చించాలని భావిస్తోంది.

నిర్ణయాలకు కోడ్‌తో బ్రేక్‌..
మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయాలకు ఈ కోడ్‌ బ్రేక్‌ వేసింది. మడు నెలలు అత్యవసరమైన అంశాలపై మాత్రమే చర్చించారు. ఒకే వేదికపై నిర్ణయాలు తీసుకోవడానికి ఆంక్షలు అడ్డుగా మారాయి. దీంతో ఫోన్లలోనే సంప్రదింపులు జరిపారు. జూన్‌ 6 కోడ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం, మంత్రులు , అధికారులు సమీక్షలతో బిజీ కానున్నారు.

పాలనపై ఫుల్‌ ఫోకస్‌..
కోడ్‌ ముగిసిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ఇక పూర్తిగా పాలనపై ఫోకస్‌ పెట్టనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న సర్కార్‌.. ముందుగా కులగణన చేపట్టాలని భావిస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లో సర్వే జరిపిన తీరును పరిశీలించి ఇంటింటి సర్వే చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

కీలకం అంశాలు సీఎం వద్దకు..
వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలు కూఏడా ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు తీసుకెళ్లేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రాధాన్యత అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఈ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో అసెంబ్లీని కూడా సమావేశపర్చి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఆలోచనలో రేవంత్‌ సర్కార్‌ ఉంది. బడ్జెట్‌ రూపకల్పనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులతో చర్చించనున్నారు. రుణ మాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లను రేవంత్‌ సర్కార్‌ తొలి ప్రాధాన్యత అంశాలుగా భావిస్తోంది.