Krishnavamsi And Prakash Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కృష్ణవంశీ… ఈయన చేసిన ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉండేవి. ఇక ఆయన తీసిన సినిమాలను చూసిన జనాలు కూడా ఆయన మేకింగ్ కి, తను చూపించే క్రియేటివిటీకి చాలా వరకు ఫిదా అయిపోయారు. అందుకే ఆయన స్టార్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోయారు. మొత్తానికైతే ఇప్పుడు కూడా ఆయన కొన్ని సినిమాలు చేయడానికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. ఇక గత సంవత్సరం వచ్చిన ‘రంగ మార్తాండ ‘ సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఇదిలా ఉంటే కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే…ప్రకాష్ రాజ్ మంచి నటుడిగా ఎదగడానికి కృష్ణవంశీ చాలా వరకు కృషి చేశారనే చెప్పాలి. ముఖ్యంగా అంతఃపురం సినిమాలో ఆయన పోషించిన పాత్రని ఇంతవరకు ఎవరు పోషించలేరు అనేంతల తను నటించి మెప్పించడమే కాకుండా ఆ పాత్రకి ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా షూటింగ్ టైం లో గాని, అలాగే ప్రకాష్ రాజ్ ఐడియాలజీ కృష్ణవంశీ ఐడియాలజీ మధ్య ఎప్పుడు ఇద్దరూ చిన్నపాటి వాగ్వివాదం పెట్టుకునే వారట. దానివల్ల ఇద్దరి మధ్య కొద్దిరోజుల పాటు మనస్పర్ధలు రావడంతో వారిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయట… దానివల్ల ఇద్దరూ చాలా సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదని కూడా అప్పట్లో వార్తలైతే వచ్చాయి. ఇక ఈ విషయాన్ని కృష్ణవంశీ కూడా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…
ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ ఇద్దరు ఒకరినొకరు ఏరా అని పిలుచుకునేంత చనువైతే ఉంది. ఇక దానివల్లే వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు డిస్కషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉండేవట…ఇక అలాంటి సందర్భంలో హర్ట్ అయిన ప్రకాష్ రాజ్ కృష్ణవంశీతో మాట్లాడటం మానేశారట. ఇక మొత్తానికైతే రంగం మార్తండా సినిమాతో వీళ్లిద్దరూ మరోసారి కలిసి పనిచేయడం అనేది వాళ్ళ అభిమానులను ఆనందానికి గురి చేసిందనే చెప్పాలి.
ఇక రీసెంట్ గా ఉత్తమ నటుడిగా ప్రకాష్ రాజ్ కి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. నిజానికి కృష్ణవంశీ లాంటి దర్శకుడు ఉండడం వల్లే ప్రకాష్ రాజ్ మంచి నటుడిగా ఎదిగాడని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ వీళ్ళ మధ్యనున్న మంచి బాండింగ్ అనేది చెడిపోకుండా ఉండాలి అంటే వీళ్ళు వరుసగా సినిమాలు చేసుకుంటూ ఉండాలి. అలా చేస్తే ప్రేక్షకులు కూడా వాళ్లను ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…