Rajamouli And Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య క్యామియో రోల్స్ కి ఎక్కువ ఆదరణ పెరుగుతుంది. రీసెంట్ గా రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో కూడా సిద్దు జొన్నలగడ్డ క్యామియో రోల్ పోషించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఆ సినిమాకి కూడా ఆయన ఇచ్చిన క్యామియో చాలా వరకు ప్లస్ అయింది. అయితే సినిమా కంటెంట్ లో లోపం ఉండడం వల్ల ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేకపోయింది. కానీ ఆయన కామియో రోల్ కి మాత్రం మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇక గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ప్రతి సినిమాలో క్యామియో రోల్స్ అనేవి కీలకపాత్ర వహిస్తూ వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో కూడా ఒక స్టార్ హీరో క్యామియో రోల్ ని పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఆ స్టార్ హీరో ఎవరు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ బాబు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మహేష్ బాబుకి మెంటర్ గా ఒక క్యారెక్టర్ అయితే ఉందట..ఇక ఆ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుంది అని ఆలోచించిన రాజమౌళి చిరంజీవితో చేయించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక కథను కూడా చిరంజీవికి వినిపించారట. ఆ క్యారెక్టర్ చిరంజీవికి బాగా నచ్చడంతో తను చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది.
ఇప్పటికే చిరంజీవి మహేష్ బాబు కాంబినేషన్ ఆచార్య సినిమా రావాల్సింది. కానీ చివరి నిమిషంలో మహేష్ బాబు ఆ క్యారెక్టర్ కి నో చెప్పడంతో ఆచార్య సినిమాలో రామ్ చరణ్ నటించాల్సి వచ్చింది. ఇక మొత్తానికైతే చిరంజీవి అంటే తనకి చాలా ఇష్టమని మహేష్ బాబు పలు సందర్భాల్లో కూడా తెలియజేశాడు. ఇక వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలియడంతో సినిమా ప్రేక్షకులు సైతం చాలా సంబరపడిపోతున్నారు. నిజానికి చిరంజీవి సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో కృష్ణ ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. అందుకే వాళ్ళ మధ్య మంచి బాండింగ్ అయితే ఉండేది.
ఇక ఇప్పుడు మహేష్ బాబు, రామ్ చరణ్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. అలాగే మహేష్ బాబు సినిమాలో చిరంజీవి ఒక కీలక పాత్రలో నటించడం వల్ల అటు మెగా అభిమానులు, ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా చాలా వరకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయనే చెప్పాలి…ఇక తొందర్లోనే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు…