https://oktelugu.com/

Stree 2: స్త్రీ 2 సినిమా సక్సెస్ లో క్రెడిట్ కోసం పోటీ పడుతున్న నటినటులు…అసలు ఆ సినిమా సక్సెస్ కి కారణం ఎవరు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ దెబ్బకి బాలీవుడ్ ఇప్పటి వరకు కోలుకోవడం లేదు. బాహుబలి సినిమాతో టాలీవుడ్ చాలా ఉత్తమమైన స్థాయి కి చేరుకుందనే చెప్పాలి...ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి...

Written By:
  • Gopi
  • , Updated On : August 21, 2024 / 10:42 AM IST

    Stree 2(1)

    Follow us on

    Stree 2: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయింది అంటే చాలు దాని క్రెడిట్ అందరూ తీసుకోవాలని చూస్తుంటారు. ముఖ్యంగా హీరోల అభిమానులు అయితే మా హీరో చేయడం వల్లే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది అంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ సినిమా దర్శకుడు వల్లే ఫ్లాప్ అయింది అంటూ దర్శకుడి ని ట్రోల్ చేస్తూ ఉంటారు… ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాగా ముందుకు దూసుకెళ్తున్న స్ట్రీ 2 సినిమా క్రెడిట్ ని కూడా ఆ సినిమాలో పనిచేసిన నటీనటులు తీసుకుంటున్నారు. నిజానికి శ్రద్ధా కపూర్ ఈ సినిమా లో లీడ్ రోల్ పోషించింది. కాబట్టి తన వల్లే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటూ తన అభిమానులు సోషల్ మీడియాలో న్యూస్ లను ఎక్కువగా వైరల్ చేస్తున్నారు.

    ఇక అలాగే రాజ్ కుమార్ రావు ఈ సినిమాలో తనదైన రీతిలో మంచి పర్ఫామెన్స్ ని ఇచ్చారు. కాబట్టి తన వల్లే ఈ సినిమా సక్సెస్ అయిందని ఆయన అభిమానులు కూడా ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్ వల్ల ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటూ ఆయన అభిమానులు చెప్పడం విశేషం… నిజానికి అక్షయ్ కుమార్ వల్ల ఈ సినిమాకి పెద్దగా కలిసి వచ్చింది అయితే ఏమీ లేదు. ఎందుకంటే అక్షయ్ కుమార్ చేసిన గత 13 సినిమాలు డిజాస్టర్లుగా మారాయి అంటే ఆయన సినిమాలను చూడడానికి తన అభిమానులు కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

    కానీ ఈ సినిమా సక్సెస్ అయింది అలాగే 500 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి సక్సెస్ ని తమ ఖాతాలో వేసుకోవాలని నటీనటుల అభిమానులు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా సక్సెస్ అనేది ఏ ఒక్కరి వళ్ళో వచ్చింది కాదు. సినిమా యూనిట్ సినిమా మీద పెట్టిన ఎఫర్ట్ అలాగే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించిన విధానం. ఇక మొదటి పార్ట్ సక్సెస్ అవ్వడం వల్ల ఆ సినిమా నుంచి వచ్చిన ఇమేజ్ కానీ అన్ని రకాలుగా ఈ సినిమాకి హెల్ప్ అయ్యాయి.

    కాబట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచి ముందుకు దూసుకెళ్తుంది. అంతే తప్ప ఏ ఒక్కరి వల్ల ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పడం కరెక్ట్ కాదంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు… ఇక ఈ సినిమాతో సక్సెస్ రావడంతో బాలీవుడ్ కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్టుగా అయింది. ఇక ఇప్పటివరకు వరుసగా భారీ ఫ్లాప్ లను చవిచూస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ అతలాకుతలం అవుతున్న సమయంలో ‘స్ట్రీ 2’ సినిమా కొంతవరకు ఉపశమనాన్ని ఇచ్చిందనే చెప్పాలి…