Tollywood: తెలుగులో చిన్న సినిమాల హవా తగ్గిపోవడానికి కారణం ఏంటి..?

పెద్ద సినిమాల హవా లేకపోవడం వల్ల వరుసగా చిన్న సినిమాలు థియేటర్లకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి చిన్న సినిమాలు పెద్ద గా సక్సెస్ లు సాదించలేకపోతున్నాయి.

Written By: Gopi, Updated On : May 7, 2024 10:41 am

What is the reason for the decrease in popularity of small films in Telugu

Follow us on

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటు ముందుకు దూసుకెళుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే చాలా చిన్న సినిమాలు కంటెంట్ ని బేస్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక వాటిలో కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్లు గా మిగులుతున్నాయి.

అయితే ఇప్పుడు పెద్ద సినిమాల హవా లేకపోవడం వల్ల వరుసగా చిన్న సినిమాలు థియేటర్లకి వచ్చి సందడి చేస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి చిన్న సినిమాలు పెద్ద గా సక్సెస్ లు సాదించలేకపోతున్నాయి. గత వారం రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం కూడా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేకపోయాయి. అందువల్లే ఇప్పుడు చిన్న సినిమాల హవా తగ్గిందనే చెప్పాలి. నిజానికి అల్లరి నరేష్ కామెడీ సినిమాతో వస్తున్నాను అని చెప్పినప్పటికీ ఆ సినిమాలో కామెడీయే లేదు. అందువల్లే ఈ సినిమా ప్రేక్షకుడికి పెద్దగా నచ్చలేదు.

ప్రసన్న వదనం సినిమాతో సుహాస్ మరో సక్సెస్ కొడతాడని అందరూ అనుకున్నప్పటికీ ఇంతకుముందు ఆయన హీరోగా వచ్చిన కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ ల మాదిరి ఈ సినిమా లేకపోవడం వల్ల ఇది సక్సెస్ సాధించే అవకాశాలైతే లేవనే చెప్పాలి. ఇక ఒకప్పుడు తెలుగులో చిన్న సినిమాల హవా బాగా నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇక మరొక నెల అయితే పెద్ద సినిమాల హవా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే చిన్న సినిమాలన్నింటిని రిలీజ్ చేస్తున్నారు.

ఇక గత సంవత్సరం ‘బేబీ ‘ సినిమా చిన్న సినిమాల్లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. మరి ఈ సంవత్సరం చిన్న సినిమాల్లో పెద్దగా హిట్ గా ఏ సినిమా నిలుస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మీదట వచ్చే కొన్ని చిన్న సినిమాలు సక్సెస్ ఫుల్ సినిమాలు గా నిలిస్తేనే చిన్న నిర్మాతలు గాని, చిన్న ఆర్టిస్టులు గాని అందరూ ఇండస్ట్రీలో మళ్ళీ కొనసాగడానికి అవకాశం ఉంటుంది…