https://oktelugu.com/

Jharkhand: పనిమనిషి ఇంట్లో.. నోట్ల కట్టల గుట్టలు.. అధికారులకు ఫ్యూజ్ లు ఔట్

జార్ఖండ్లోని అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అతని ఇంట్లో మరో వ్యక్తి పని చేస్తున్నాడు. అతడి వద్ద మంత్రి కార్యదర్శి భారీ ఎత్తున నగదు డంప్ చేశాడని అధికారులకు సమాచారం అందింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 7, 2024 10:43 am
    Jharkhand

    Jharkhand

    Follow us on

    Jharkhand: డబ్బు.. ఎటు చూసినా డబ్బే.. కట్టలు కాదు.. గుట్టలుగా.. సోదాలకు వెళ్లిన అధికారులకే ఫ్యూజులు అవుట్ అయ్యాయి. గంటలకొద్దీ లెక్కపెట్టినా ఆ డబ్బు అంతకంతకూ పెరుగుతూ పోయింది కాని.. ఇసుమంతయినా తగ్గలేదు. చివరికి అధికారులు యంత్రాలు తీసుకురావాల్సి వచ్చింది. ఆ యంత్రాల సహాయంతో గంటలపాటు లెక్కిస్తే తప్ప.. ఆ డబ్బు లెక్క ఒక కొలిక్కి రాలేదు.

    జార్ఖండ్లోని అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అతని ఇంట్లో మరో వ్యక్తి పని చేస్తున్నాడు. అతడి వద్ద మంత్రి కార్యదర్శి భారీ ఎత్తున నగదు డంప్ చేశాడని అధికారులకు సమాచారం అందింది. దీంతో కేంద్ర బలగాల సహాయంతో ఆ అధికారులు ఆ పనిమనిషి ఇంటికి వెళ్లారు. అక్కడ బీరువాలు.. ఇతర బ్యాగులను తనిఖీ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అధికారుల లెక్కల్లో తేలిన నగదు దాదాపు 34 కోట్లట.. ఇదంతా కూడా నల్లధనం అని అధికారులు చెబుతున్నారు. మరో మూడు కోట్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

    జార్ఖండ్ రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ గా వీరేంద్ర కుమార్ రామ్ అనే అధికారి పనిచేసేవారు. గత ఏడాది పదివేల లంచం తీసుకుంటూ అరెస్టు అయ్యారు. అనంతరం అతనిపై మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఒకసారిగా సన్నివేశం మారిపోయింది. విచారణలో అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా రాంచీలోని పలు ప్రాంతాలలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేశారు.

    కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జార్ఖండ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ దగ్గర పనిచేసే జహంగీర్ ఆలం అనే వ్యక్తి ఇంట్లో అధికారులు తనిఖీలు జరపగా భారీగా నగదు లభ్యమయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతడి ఇంట్లో 500 కోట్ల వరకు డబ్బు డంప్ చేశారని తెలుస్తోంది. 500 రూపాయల నోట్ల బండిల్స్ కుప్పలుగా పడి ఉండడంతో అధికారులు నోళ్లు వెళ్లబెట్టారు. ఈ డబ్బును లెక్కించడానికి అధికారులకు చాలా సమయం పట్టింది. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ తనిఖీలు కొనసాగాయి. మంగళవారం ఉదయం నాటికి స్వాధీనం చేసుకున్న నగదు లెక్కను అధికారులు బయటికి ప్రకటించారు. కాగా, సోదాలు జరుగుతున్నప్పుడు ఒడిశా రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.. ఈ విషయాన్ని ఆయన తన స్పీచ్ లో ప్రస్తావించారు. “ఇప్పుడే నాకు ఒక వార్త అందింది. జార్ఖండ్ రాష్ట్రంలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయట.. పనిమనిషి ఇంటిని అవినీతికి స్థావరంగా చేసుకున్నారు.. నోట్లను లెక్కించి నగదు లెక్కింపు యంత్రాలు మోరాయించాయట. ఇదంతా కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ తాలూకు బ్లాక్ మనీనేనా దీనిపై ఆ పార్టీ యువరాజు ఆన్సర్ ఇస్తారా” అంటూ మోడీ దెప్పి పొడిచారు.