Thaman OG movie music: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన, యాంగ్ హీరోలైన సినిమా కథ బాగుంటేనే ఆ మూవీస్ సూపర్ సక్సెస్ గా మారుతాయి. అంతేతప్ప స్టార్ హీరోలు ఉన్నంత మాత్రాన సినిమాలు సూపర్ సక్సెస్ గా మారుతాయి అనుకోవడం మూర్ఖత్వం అవుతోంది. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు భారీ సక్సెస్ ల మీద కన్నేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో యంగ్ హీరోలు మాత్రం ఒక సెలెక్టెడ్ సినిమాలను చుజ్ చేసుకుంటూ మంచి విజయాలను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ‘ఓజీ’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతోంది. ఇక మొదటి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది అంటూ ఇప్పటికే కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆయన ఈ మధ్య ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన కూడా ఓజీ సినిమా గురించే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అంటే ఈ సినిమా కి తను స్పెషల్ వర్క్ చేస్తున్నట్టుగా చెబుతున్నాడు. నిజానికి ఓజీ సినిమా మీద తమన్ అంత స్పెషల్ కేర్ తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో తమన్ కి భారీ సక్సెస్ అయితే దక్కలేదు.
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనిరుధ్, సంతోష్ నారాయణన్, శ్యామ్ సి యస్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు వరుసగా భారీ విజయాలను సాధిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఓజి సినిమా అవుట్ పుట్ చాలా అద్భుతంగా రావడంతో ఈ సినిమాని ఎలాగైనా సరే తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మరింత ఎలివేట్ చేస్తే తనకి కూడా మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతోనే తమన్ ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలకు మంచి మ్యూజిక్ ని అందించాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఇంతకుముందు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలతో మంచి మ్యూజిక్ ని అందించి తన రేంజ్ ఏంటో చూపించాడు. ఇంకా ఓజీ సినిమాకి సైతం అంతకు మించిన మ్యూజిక్ ని అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మాత్రం తమన్ బ్యా గ్రౌండ్ స్కోర్ విషయంలో అతనికి కూడా చాలా మంచి గుర్తింపైతే వస్తుంది…