Narendra Modi biopic Maa Vande: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక హీరోలను టాప్ పొజిషన్ లో నిలుపడానికి దర్శకులు సైతం మంచి కథలతో సినిమాలను చేస్తూ ఉంటారు.. ఇక ప్రస్తుతం ఉన్న దర్శకులు సక్సెస్ సాధించడానికి వివిధ తరహా కథను ఎంచుకొని సినిమాలు గా తెరకెక్కిస్తున్నారు. కానీ కొన్ని బయోపిక్ లకు మాత్రం చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది…ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఎమ్మెస్ ధోని మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇక అదే తరహాలో మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి జీవిత కథ ఆధారంగా ఒక సినిమానైతే తెరకెక్కిస్తున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టిన రోజు కావడం వల్ల ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాకి ‘మా వందే’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ పోస్టర్లో మోడీ ఒక పేపర్ మీద సంతకం చేస్తున్నట్టుగా ఉంది. ‘ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్ప బలం గొప్పది’ అంటూ ఒక మంచి మాట అయితే ఉంది. మోడీ తన కెరియర్ లో ఎలాంటి పనులను చేశాడు. ఎలా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు.
అలాగే ఇండియాను టాప్ లెవెల్ కి ఎలా తీసుకెళ్లాడు అనే విషయాలను కూడా ఇందులో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో కన్నడ హీరో అయిన ఉన్ని ముకుందన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక గత సంవత్సరం మార్కో సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా వెలుగొందుతున్నాడు…
ఇక మోడీ బయోపిక్ కి ఆయనైతే బాగా సెట్ అవుతాడనే భావించి సిహెచ్ క్రాంతి కుమార్ అతన్ని మోడీ క్యారెక్టర్ కోసం ఎంపిక చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తోంది. తద్వారా మోడీ తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే విషయాలను కూడా ఇందులో తెలియజేయబోతున్నట్టుగా తెలుస్తోంది… మోడీ లాంటి నాయకుడు మాకు కావాలి అని ఇతర దేశాల ప్రజలు సైతం కోరుకుంటున్న వేళ ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే ఏర్పడుతోంది.