https://oktelugu.com/

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సైలంట్ వెనుక కారణలెంటీ?

‘హ్యాపీడేస్’ చిత్రదర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య.. సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్.. ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ మూవీని శేఖర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన తొలినాళ్లలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘లవ్ స్టోరీ’ షూటింగ్ చివరిదశలో ఉండగానే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. ఇటీవల టాలీవుడ్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 10:35 AM IST
    Follow us on

    ‘హ్యాపీడేస్’ చిత్రదర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య.. సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రొమాంటిక్.. ఎమోషనల్ లవ్ స్టోరీతో ఈ మూవీని శేఖర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన తొలినాళ్లలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘లవ్ స్టోరీ’ షూటింగ్ చివరిదశలో ఉండగానే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. ఇటీవల టాలీవుడ్లో సినిమాల సందడి మొదలుకావడంతో ‘లవ్ స్టోరీ’ కూడా పట్టాలెక్కింది. చివరి దశకు చేరుకున్న ‘లవ్ స్టోరీ’ సైలంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తొలినాళ్లలో సినిమాపై ఏర్పడిన పాజిటివ్ బజ్ ప్రస్తుతం కన్పించడం లేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

    Also Read: కీర్తి బ్యాడ్ సెంటిమెంట్.. కలవరపడుతున్న మహేష్ ఫ్యాన్స్..!

    ‘లవ్ స్టోరీ’ గుమ్మడికాయ కొట్టేందుకు సిద్ధంగా ఉండటంతో ఈ సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా? లేదా ఓటీటీలో రిలీజు అవుతుందా? అనేది తేలాల్సి ఉంది. కరోనా క్రైసిస్ లేకుండా ఉంటే ఈ మూవీ ఎప్పుడో థియేటర్లలో రిలీజయ్యేది. అయితే ప్రస్తుతం ఎలాంటి సౌండింగ్ లేకుండానే దర్శకుడు ‘లవ్ స్టోరీ’ని పూర్తి చేస్తుండటం గమనార్హం.

    Also Read: ఓటీటీ వద్దు మహా ప్రభో ఆంటోన్న లెజెండరీ క్రికెటర్ !

    దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలపై ఓవర్గం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రేమకథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చైతు.. టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి కాంబో సెట్ కావడంతో సినిమా హిట్ అవుతుందనే టాక్ విన్పించింది. అయితే సినిమా ప్రారంభం చూపినంత ప్రభావం చివర్లో చూపించడం లేదని టాక్ విన్పిస్తోంది. దీంతో ‘లవ్ స్టోరీ’ని జనాలు పట్టించుకోవడం లేదా? లేక చిత్రయూనిట్ ఇప్పట్లో ప్రమోషన్ ఎందుకని సైలంట్ అయ్యారా? అనేది ఆసక్తికరంగా మారింది.